మనుషుల అక్రమ రవాణాపై ఎన్‌ఐఏ కొరడా

13
- Advertisement -

మనుషుల అక్రమ రవాణా సిండికేట్‌పై ఎన్ఐఏ కొరడా ఝుళిపించింది. ఢిల్లీలోని తిలక్ నగర్‌కు చెందిన గగన్‌దీప్ సింగ్ అలియాస్ గోల్డీని అరెస్ట్ చేశారు పోలీసులు.

పంజాబ్‌లోని తరన్ తరన్‌కు ఓ బాధితుడి నుంచి రూ.45 లక్షలు వసూలు చేయగా డంకీ మార్గాల్లో గతేడాది డిసెంబర్‌లో స్పెయిన్, ఎల్ సాల్వడార్, గ్వాటెమాల, మెక్సికో మీదుగా అమెరికాకు తరలించినట్లు గుర్తించారు.

ఫిబ్రవరిలో ఆ వ్యక్తిని గుర్తించి వెనక్కి పంపింది అమెరికా యంత్రాంగం. స్వదేశానికి చేరుకున్న తర్వాత పంజాబ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకుని స్వాధీనం చేసుకుంది ఎన్ఐఏ. సిండికేట్‌లో ఇతర సభ్యుల గురించి ఆరా తీస్తోంది ఎన్ఐఏ.

- Advertisement -