- Advertisement -
ఢిల్లీ అనాజ్ మండి అగ్నిప్రమాద ఘటనను సుమోటోగా స్వీకరించిందింది జాతీయ మానవ హక్కుల కమిషన్(NHRC). ఢిల్లీ సీఎస్,పోలీస్ కమిషనర్, ఎన్.డి.ఎమ్.సి కమిషనర్,కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శికి నోటీసులు ఇచ్చింది. ఈ ఘటనపై ఆరు వారాల్లోగా అగ్నిప్రమాదం పై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
అగ్నిప్రమాదానికి కారకులైన అధికారులపై తీసుకున్న చర్యలు,భాదితులకు పునరావాస,ఉపశమన చర్యలను నివేదికలో తెలపాలని ఆదేశించింది.నిపుణులు కమిటీని కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది జాతీయ మానవ హక్కుల కమిషన్. నిపుణుల కమిటి ఢిల్లీ మాస్టర్ ప్లాన్ పై అధ్యయనం చేయాలని అభిప్రాయపడింది.
అనాజ్ మండిలోని భవనంలో జరిగిన అగ్నిప్రమాదం లో 43 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మీడియా కధనాలను సుమోటోగా స్వీకరించింది ఎన్‌హెచ్‌ఆర్సీ.
- Advertisement -