తెలంగాణ ప్రభుత్వానికి షాక్..

1
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వానికి షాక్ తగిలింది. సంధ్య థియేటర్ ఘటనపై నివేదిక ఇవ్వాలని పోలీసులకు మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటపై నివేదిక ఇవ్వాలని డీజీపీ, హైదరాబాద్ సీపీకి మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది.

పోలీసుల లాఠీఛార్జ్ వల్లే రేవతి చనిపోయిందని కమిషన్‌కు ఫిర్యాదు చేశారు న్యాయవాది రామారావు. దీంతో ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీనియర్ ర్యాంక్ పోలీసు అధికారితో విచారణ జరపాలని కోరింది NHRC. లాఠీఛార్జ్ పై నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీచేసింది.

Also Read:TTD:ఆన్ లైన్‌లో బ్రేక్ దర్శనాల బుకింగ్

- Advertisement -