Next Pandemic Disease X:కొవిడ్ కంటే ప్రాణాంతకం..

12
- Advertisement -

కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలంతో ప్రపంచం గజగజ వణికిపోతోంది. కరోనా మహమ్మారి ధాటికి లక్షల సంఖ్యలో ప్రజలు ప్రానాలు కొల్పోయారు. ఇక కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. కరోనా కంటే ప్రాణాంతకమైన ఎక్స్ మహమ్మారి ప్రబలవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఈ వ్యాధి ప్రబలితే ప్రపంచ వ్యాప్తంగా 50 మిలియన్ల మందిని చంపే అవకాశముందని వెల్లడించింది.

భూ గృహంపై దాగి ఉన్న మిలియన్ల కొద్దీ వైరస్ ల నుంచి ఎక్స్ మహమ్మారి ప్రబలే అవకాశముందని తెలిపారు. భూమిపై 25 వైరస్ కుటుంబాలను గుర్తించారని, వీటిలో ఏదైనా ఎక్స్ మహమ్మారి ప్రబలటానికి కారణమవుతుందని చెప్పారు.

ఎక్స్ మహమ్మారి జూనోటిక్ వ్యాధి అని, ఇది అడవి, పెంపుడు జంతువుల్లో ఉద్భవించి ఎబోలా, హెచ్ఐవీ, ఎయిడ్స్, కొవిడ్ లాగా మనుషులకు సోకుతుందని WHO వెల్లడించింది. ఎక్స్ మహమ్మారి ఎప్పుడు వ్యాప్తి చెందుతుందనే విషయం కాదని, దానిని ఎదుర్కోవడానికి ప్రపంచం సిద్ధంగా ఉండాలలని పిలుపునిచ్చింది.

Also Read:చంద్రముఖి 2…అందరికీ నచ్చుతుంది 

- Advertisement -