Viral Video:నవ దంపతులు..ఇదేం పని!

5
- Advertisement -

సోషల్ మీడియా వ్యసనం ఎంత ప్రమాదకరమో మరోసారి రుజువైంది. గ్వాలియర్‌లో తమ పెళ్లిని సెలబ్రేట్ చేసుకోవడానికి కొత్తగా పెళ్లైన జంట రన్నింగ్ కారుపై డ్యాన్స్ చేయగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గ్వాలియర్‌లోని కొత్త రైల్వే ఓవర్‌బ్రిడ్జ్ సమీపంలో రన్నింగ్ కారు పైకి ఎక్కి, కత్తిని ఊపుతూ పెళ్లి కొడుకు డ్యాన్స్ చేయగా పెళ్లికూతురు మాత్రం తన పెళ్లి వస్త్రధారణలోనే కారు బోనెట్‌పై కూర్చుని, బాలీవుడ్ సినిమా “ఇష్క్ కీ గలీ విచ్ నో ఎంట్రీ” పాటకు నాట్యం చేసింది.

ఈ వీడియో వైరల్‌ కావడంతో గ్వాలియర్ ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించినందుకు ఈ జంటపై చలాన్ జారీ చేశామని పోలీసులు తెలిపారు. ఇలాంటి స్టంట్లు ప్రదర్శించేవారి ప్రాణాలనే కాదు, ఇతర ప్రయాణికుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తాయని పోలీసులు తెలిపారు.

 https://x.com/todaysvoice24nz/status/1919693135204200567?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1919693135204200567%7Ctwgr%5Ecbb0e817fd44fe614d77475c7ee36ceb28400af6%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fmunsifdaily.com%2Fviral-video-newlywed-couple-dances-on%2F

Also Read:Tollywood:ఒకే చోట..ఒకే ఫ్రేమ్‌లో దర్శకులు!

- Advertisement -