భారత్‌తో వచ్చే నెలలో ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టును ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్‌కు గ్రోయిన్ గాయం కావడంతో ఈ వన్డే సిరీస్‌కు విశ్రాంతినిచ్చారు. అతని స్థానంలో మైకేల్ బ్రేస్‌వెల్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో వెన్ను గాయంతో జట్టుకు దూరమైన కైల్ జేమిసన్ తిరిగి మైదానంలోకి రానున్నాడు. అతడు వన్డే, టీ20 రెండు వైట్‌బాల్ జట్లలోనూ చోటు దక్కించుకున్నాడు.
గాయాల కారణంగా నాథన్ స్మిత్, బ్లేర్ టిక్నర్, మార్క్ చాప్మన్, మ్యాట్ హెన్రీ ఈ సిరీస్‌కు దూరమయ్యారు. జాకబ్ డఫీ, రాచిన్ రవీంద్రలకు విశ్రాంతినిచ్చారు.
ఎడమచేతి స్పిన్నర్ జేడెన్ లెనాక్స్కు తొలిసారి న్యూజిలాండ్ జట్టుకు పిలుపు లభించింది. అతడితో పాటు క్రిస్టియన్ క్లార్క్, ఆది అశోక్, జోష్ క్లార్క్‌సన్, నిక్ కెల్లీ, మైకేల్ రే వంటి కొత్త ముఖాలు జట్టులో చోటు దక్కించుకున్నాయి.
న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా జనవరి 11 నుంచి మూడు వన్డేలు, జనవరి 21 నుంచి ఐదు టీ20లు జరగనున్నాయి.
న్యూజిలాండ్ వన్డే జట్టు:
మైకేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్), ఆది అశోక్, క్రిస్టియన్ క్లార్క్, జోష్ క్లార్క్‌సన్, డెవన్ కాన్వే, జాక్ ఫౌల్క్స్, మిచ్ హే, కైల్ జేమిసన్, నిక్ కెల్లీ, జేడెన్ లెనాక్స్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, మైకేల్ రే, విల్ యంగ్
న్యూజిలాండ్ టీ20 జట్టు:
మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైకేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్మన్, డెవన్ కాన్వే, జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్, మ్యాట్ హెన్రీ, కైల్ జేమిసన్, బెవాన్ జేకబ్స్, డారిల్ మిచెల్, జేమ్స్ నీస్‌హామ్, గ్లెన్ ఫిలిప్స్, రాచిన్ రవీంద్ర, టిమ్ రాబిన్సన్, ఇష్ సోధి
Also Read:‘బాహుబలి’ ప్రయోగం సక్సెస్:ఇస్రో

