దక్షిణ భారతదేశానికి చెందిన ప్రియాంక రాధాకృష్ణన్ న్యూజిలాండ్ ఎంపీగా కొనసాగుతున్నారు. ఆమె తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ను కలిశారు. దీనిపై కేటీఆర్ ట్వీట్ చేశారు. న్యూజిలాండ్ మహిళా ఎంపీ ప్రియాంకని కలవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ, న్యూజిలాండ్ మధ్య అనేక ఒప్పందాల కోసం చర్చించామని కేటీఆర్ వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రియాంకను సత్కరించి జ్ఞాపికను బహూకరించారు.
ఈ విషయంపై ప్రియాంక ఆనందం వ్యక్తం చేశారు. కేటీఆర్‌తో సమావేశాన్ని ఎంతో ఆస్వాదించానని తెలిపారు. కేటీఆర్ ఎంతో సహృదయుడని, తమ మధ్య ఆహ్లాదకరమైన సంభాషణలు చోటుచేసుకున్నాయని వివరించారు. భారత రాజకీయ వ్యవస్థపైనా, అగ్రి టెక్నాలజీ,ఆవిష్కరణలు, స్టార్టప్ లు తదితర అంశాలపై చర్చించామని వెల్లడించారు. అంతేకాకుండా, న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెన్ నాయకత్వంపై తామిద్దరికీ ఉన్న అభిమానం గురించి కూడా మాట్లాడుకున్నామని ఆమె పేర్కొన్నారు.
New Zealand MP @priyancanzlp called on Minister @KTRTRS in Hyderabad today. Among a host of issues discussed were possibilities of mutual cooperation in Agritech, and Innovation sectors. pic.twitter.com/vY8sNXZmoQ
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) January 8, 2020
Really enjoyed meeting with @KTRTRS. He was incredibly generous with his time. We had a good chat about the Indian political system & areas of mutual interest like agritech, innovation & start-ups- also mutual admiration of our PM @jacindaardern's leadership!
— Priyanca R (@priyancanzlp) January 8, 2020