టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

186
toss

వరుస విజయాలతో జోరు మీదుంది టీంఇండియా. న్యూజిలాండ్ తో 5వన్డేల టీ20లో భాగంగా నేడు 2వ టీ20 జరుగనుంది. ఆక్లాండ్ లోని ఈడెన్ పార్క్ మైదానంలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఎలాంటి మార్పులు లేకుండా ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి.

కాగా 5టి20ల్లో భాగంగా మొదటి మ్యాచ్ ఇండియా గెలిచిన సంగతి తెలిసిందే. రెండో మ్యాచ్ గెలుపు పై ఇరు జట్లు ధీమాతో ఉన్నాయి. మొదటి మ్యాచ్‌లో టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్ 29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులతో 58 పరుగులు చేసి ఇండియా గెలుపులో కీలకంగా వ్యవహరించాడు.

టీంఇండియాః రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, దుబే, మనీశ్ పాండే, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, ఛాహల్, షమీ, బుమ్రా