పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మేవరిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ విడుదలైంది. ముందుగా ప్రకటించినట్లుగానే 2026 న్యూ ఇయర్ ప్రారంభ క్షణాల్లోనే సందీప్ రెడ్డి వంగా ఈ సినిమా నుంచి ప్రభాస్ లుక్‌ను రివీల్ చేశారు. ఇందులో హీరోయిన్‌గా తృప్తి డిమ్రీ నటిస్తుండటంతో డార్లింగ్ ఫ్యాన్స్‌కు ఇది నిజంగా డబుల్ థమాకాగా మారింది.
విడుదలైన పోస్టర్‌ను గమనిస్తే సినిమాలో యాక్షన్ ఎంత ఇంటెన్స్‌గా ఉండబోతోందో స్పష్టంగా అర్థమవుతోంది. ఫుల్ ఫిట్‌నెస్‌తో కనిపిస్తున్న ప్రభాస్ శరీరంపై అనేక గాయాలు, వాటికి కట్టులు కనిపిస్తున్నాయి. ఆఫ్‌బేర్ బాడీతో ఉన్న ఆయన చేతిలో మద్యం బాటిల్ ఉండగా, పెదవులపై ఉన్న సిగరెట్‌ను తృప్తి డిమ్రీ లైటర్‌తో వెలిగిస్తోంది. ప్రభాస్‌ను ఇంత స్టైలిష్, రఫ్ లుక్‌లో అభిమానులు ఇప్పటివరకు చూడలేదనే చెప్పాలి. ఈ లుక్‌తో ‘స్పిరిట్’పై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. కొందరు ఈ లుక్ ‘యానిమల్’ సినిమాలో రణబీర్ కపూర్‌ను పోలి ఉందని కామెంట్స్ చేస్తున్నారు.
ఈ పోస్టర్‌తో పాటు “ఇండియన్ సినిమా… విట్‌నెస్ యువర్ ఆజానుబాహుడు, హ్యాపీ న్యూ ఇయర్ 2026” అంటూ సందీప్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే “ఇప్పటి వరకూ ఉన్నదాన్ని మీరు ప్రేమించారు… ఇక మీకు తెలియని కొత్తదాన్ని ప్రేమించండి” అంటూ స్పిరిట్ టీమ్ ట్యాగ్‌లైన్ విడుదల చేసింది.
ఇప్పటికే ‘సౌండ్ స్టోరీ’ పేరుతో విడుదలైన ఆడియో గ్లింప్స్‌లో ప్రకాశ్ రాజ్, ప్రభాస్ వాయిస్‌లు ఆసక్తిని రేపాయి. ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్, కాంచన కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రణయ్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్, కిషన్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Also Read:KTR:కాంగ్రెస్ పాలనలో మార్పు లేదు..తిరోగమనమే

