నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. ఇక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా వివిధ రకాల వస్తువులను ఆర్డర్ చేశారు వినియోగదారులు. డిసెంబర్ 31న భారతీయులు ఎక్కువగా ఆర్డర్ చేసిన ఐటమ్స వివరాలను ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజాలు బ్లింకిట్, స్విగ్గీ, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ షేర్ చేశాయి.
డిసెంబర్ 31 మధ్యాహ్నం వరకే స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ 4,779 ప్యాక్‌ల కండోమ్స్ డెలివరీ చేసింది. సాయంత్రం తరువాత నిరోధ్‌ల విక్రయాలు మరింత పెరిగాయి. బ్లింకిట్‌లో సైతం కండోమ్ అమ్మకాలు భారీగా పెరిగాయని నిర్వాహకులు తెలిపారు. రాత్రి 9.50 గంటల సమయానికి 1.2 లక్షల కండోమ్‌ల ప్యాకెట్లు డెలివరీ చేశామని వెల్లడించారు.
మరికొంతమంది పాలు, చిప్స్, చాక్లెట్, ద్రాక్ష, పన్నీర్ ఐటమ్స్ ఆర్డర్ చేశారు. బిగ్‌బాస్కెట్‌లో నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్ విక్రయాలు 552 శాతం పెరిగాయి. డిస్పోజబుల్ కప్పులు, ప్లేట్‌ల ఆర్డర్స్ సైతం 325 శాతం పెరిగాయి.
Also Read:కోలుకుంటున్న శ్రీతేజ్: సీతక్క