ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో న్యూ ఇయర్ 2025

1
- Advertisement -

హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో న్యూ ఇయర్ 2025 వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎన్ సీసీ ప్రెసిడెంట్ కేఎస్ రామారావు, వైస్ ప్రెసిడెంట్ ఎస్ఎన్ రెడ్డి, సెక్రటరీ తుమ్మల రంగారావు, జాయింట్ సెక్రటరీ కేశిరెడ్డి శివారెడ్డి, ట్రెజరర్ జూజాల శైలజ, ఎంసీ మెంబర్స్ కాజా సూర్యనారాయణ, కె మురళీమోహన్ రావు, సీఎస్ నవకాంత్, భాస్కర్ నాయుడు, జె బాలరాజు, ఏడిద రాజా, వివిజి కృష్ణంరాజు, వేణు, సీహెచ్ వరప్రసాదరావు, కోగంటి భవానీ, తదితరులు పాల్గొన్నారు. కల్చరల్ కమిటీ కన్వీనర్‌ ఏడిద రాజా, కల్చరల్ కమిటీ ఛైర్మన్ ఎ గోపాలరావు, కల్చరల్ కమిటీ అడిషనల్ ఛైర్మన్ సురేష్ కొండేటి, కల్చరల్ కమిటీ మెంబర్స్ పద్మజ, శివ ఆధ్వర్యంలో న్యూ ఇయర్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు.

శ్రీముఖి వ్యాఖ్యాతగా ఆద్యంతం కార్యక్రమం సందడిగా సాగింది. శివారెడ్డి చేసిన మిమిక్రీ పర్ ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంది. హీరోయిన్ మెహరీన్ చేసిన డ్యాన్స్ పర్ ఫార్మెన్స్ కార్యక్రమానికి హైలైట్ గా నిలిచింది. మ్యూజిక్ డైరెక్టర్ వందేమాతరం శ్రీనివాస్ బృందం పాడిన పాటలు, సింగర్ మంగ్లీ బ్యాండ్ ఆలపించిన సాంగ్స్ వీక్షకులు అందరిలో జోష్ తీసుకొచ్చాయి. అనంతరం ఎఫ్ఎన్ సీసీ కమిటీ సభ్యులంతా కేక్ కట్ చేసి న్యూ ఇయర్ కు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. ఈ సందర్భంగా

ఎఫ్ఎన్ సీసీ ప్రెసిడెంట్ కేఎస్ రామారావు మాట్లాడుతూ – ఎఫ్ఎన్ సీసీ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. డీవీఎస్ రాజు గారు, కేఎల్ నారాయణగారు, ఆదిశేషగిరి రావు గారు ఈ కల్చరల్ సెంటర్ ను ఎంతో అభివృద్ధి చేశారు. వారి బాటలోనే మేమూ సభ్యులకు మరింత సౌకర్యంగా ఉండేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మూడు దశాబ్దాలుగా మన కల్చరల్ సెంటర్ మిగతా అన్ని కల్చరల్ సెంటర్స్ కంటే బాగా పేరు తెచ్చుకుంది. మన కమిటీ మెంబర్స్ తో పాటు ఇక్కడున్న స్టాఫ్ డెడికేటెడ్ గా వర్క్ చేయడం వల్లే ఇది సాధ్యమైంది. అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎఫ్ఎన్ సీసీ మాజీ ప్రెసిడెంట్ కేఎల్ నారాయణ, ఎఫ్ఎన్ సీసీ మాజీ ప్రెసిడెంట్, ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీ ప్రెసిడెంట్ ఆదిశేషగిరి రావు, ఎఫ్ఎన్ సీసీ మాజీ సెక్రటరీ శ్రీనివాసరాజు, ఎఫ్ఎన్ సీసీ మాజీ సెక్రటరీ ఐవీ సోమరాజు, ఎఫ్ఎన్ సీసీ మాజీ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి, ముళ్లపూడి మోహన్, మెయిన్ స్పాన్సర్ సిద్ధార్థ ఫైన్ జ్యూవెల్లర్స్ నుంచి కృష్ణప్రసాద్, నాగినీ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. అతిథులకు కమిటీ మెంబర్స్ పుష్ప గుచ్చాలు, శాలువాలతో సత్కరించారు.

Also Read:TTD: వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ

- Advertisement -