వాట్సప్ వినియోగదారులకు శుభవార్త తెలపింది ఫేస్ బుక్ యాజమాన్యం. సరికొత్త టెక్నాలజీతో ప్రజెంట్ ట్రెండింగ్ లో ముందజలో ఉంది వాట్సప్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నది కూడా వాట్సప్ లోనే. కొత్త కొత్త టెక్నాటజీతో వినియోగదారులను అట్రాక్ట్ చేస్తుంది. ఇప్పటికే చాలా ఫ్యూచర్ లతో ముందంజలో ఉంది. చాటింగ్, ఆడియో కాలింగ్, విడియో కాలింగ్ ఇలా పలు సౌకర్యాలు కలిపిస్తు వినియోగదారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
అయితే ఇప్పడు మరో కొత్త ప్యూచర్ తో మనముందుకొచ్చింది వాట్పప్. చాలాకాలం నుంచి అందరూ ఎదురుచూస్తున్న వాట్స్ ప్ గ్రూప్ వీడియో కాల్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. నేడు జరిగిన ఎఫ్ 8 డెవలపర్ కాన్ఫరెన్స్ మీటింగ్ లో ఫేస్ బుక్ సంస్ధ తెలిపింది. ఈ ఫీచర్ ద్వారా ఒక గ్రూపులోని కొంతమంది సభ్యులు మరికొంత మందికి వీడియో కాల్ చేసుకొవచ్చు. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా పనిచేసే స్మార్ట్ ఫోన్లలో 2.18.145 వెర్షన వాడుతున్న వినియోగదారులు ఈ గ్రూప్ వీడియో కాల్ చేసుకునే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఈ ఫ్యూచర్ కొంత మందికి మాత్రమే అందుబాటులోకి తెస్తుండగా..రానున్న రోజుల్లో అందరికి ఈ ఫ్యూచర్ అందించేలా ఏర్పాటు చేస్తామని తెలిపారు.