డేంజర్.. ఫోన్ లోకి కొత్త వైరస్!

26
- Advertisement -

ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో ప్రతిదీ ఇంటర్నెట్ తో ముడి పడి ఉంటుంది. బ్యాంకింగ్ లావాదేవీలు మొదలుకొని, ఏదైనా వస్తువు కొనుకోవడం వరకు ప్రతిదీ కూడా స్మార్ట్ ఫోన్ ఉపయోగించే చేస్తుంటాము. ఇంకా మన వ్యక్తిగత సమాచారం కూడా స్మార్ట్ ఫోన్ లోనే పొందుపరుస్తుంటాము. మన ఫోటోస్, ఆధార్ కార్డ్ వివరాలు, బ్యాంక్ వివరాలు.. ఇలా అన్నిటికి సంబంధించిన సమాచారం అంతా కూడా ఒక్క మొబైల్ లోనే సేవ్ చేసుకుంటూ ఉంటాము. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ హ్యాంకింగ్ కు గురైతే మన వ్యక్తిగత సమాచారం అంతా కూడా హ్యాకర్స్ చేతిలోకి వెళ్లిపోతుంది..

దాంతో మనకు తెలియకుండానే మన బ్యాంక్ అకౌంట్ నుంచి నగదు కొట్టేయడం, మన ఫోటోస్ ను మార్ఫింగ్ చేసి ఇంటర్నెట్ లో పెట్టడం లేదా బ్లాక్ మెయిల్ చేయడం వంటివి చేస్తుంటారు. అందుకే మన స్మార్ట్ ఫోన్ హ్యాకింగ్ బారిన పడకుండా ఎంతో జాగ్రత్త వహించాలి. ఇదిలా ఉంచితే తాజాగా మరో కొత్త యాప్ ద్వారా స్మార్ట్ ఫోన్ లోకి మాల్వేర్ ను పంపిస్తున్నారట హ్యాకర్స్. వాట్సప్ ద్వారా సేఫ్ చాట్ అనే యాప్ లింక్ పంపిస్తూ దాని ద్వారా డేటా మొత్తం చోరీ చేస్తున్నారట హ్యాకర్స్.

Also Read:నేటి నుండి రైతు రుణమాఫీ..

ప్రస్తుతం చాటింగ్ యాప్స్ కు ఫుల్ డిమాండ్ ఉండడంతో ఇదే అదునుగా భావించిన హ్యాకర్స్ సేఫ్ చాట్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్న వారు మొబైల్ పర్మిషన్స్ ఇస్తే ఇంతే.. క్షాంశాల్లో డేటా మొత్తం హ్యాకర్స్ చేతిలోకి వెళ్లిపోతుంది. భారత్ కు చెందిన హ్యాకింగ్ గ్రూప్ బహముత్ ఈ సేఫ్ చాట్ యాప్ ను రూపొందించినట్లు తెలుస్తోంది. కాబట్టి స్మార్ట్ ఫోన్ యూజర్స్ అంతా అప్రమత్తంగా ఉండాలని వాట్సప్ లేదా ఎస్‌ఎం‌ఎస్ ద్వారా వచ్చే ఆన్ నౌన్ లింక్ లను ఎట్టి పరిస్థితిలో ఒకే చేయరాదని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా థర్డ్ పార్టి యాప్స్ ను అసలు డౌన్ లోడ్ చేయరాదని, ఎలాంటి యాప్ అయిన గూగుల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే డౌన్ లోడ్ చేసుకోవాలని చెబుతున్నారు టెక్ నిపుణులు.

Also Read:Tamarind:చింతపండు అతిగా వాడితే ప్రమాదమా?

- Advertisement -