త్వరలో యూనివర్సిటీలకు వీసీల నియామకం..

48
vc

రాష్ట్రంలో త్వరలో యూనివర్సిటీలకు పూర్తిస్ధాయి వీసీల నియామకం జరగనుంది. ఈ మేరకు వీసీల నియామకానికి సంబంధించిన ప్రతిపాదనలను సిద్దం చేసింది ప్రభుత్వం. ఒక్కో యూనివర్సిటీకి ముగ్గురు పేర్లను ప్రతిపాదించగా ఇప్పటికే ప్రతిపాదిత నియామక దస్త్రాన్ని ఆమోదం కోసం రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌కు పంపింది. ఆమె ప్రస్తుతం పుదుచ్చేరి పర్యటనలో ఉండటంతో దస్త్రానికి ఆన్‌లైన్‌లో ఆమోదం తెలిపే అవకాశం ఉందని సమాచారం.

గవర్నర్‌ ఆమోదం తెలిపితే నేడో, రేపో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలోని ఓయూ, కాకతీయ, జేఎన్టీయూహెచ్‌, శాతవాహన, అంబేద్కర్‌, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, తెలుగు విశ్వవిద్యాలయం వర్సిటీలకు కొత్త వీసీలు రానున్నారు.