దొరికిన కరక్కాయ మోసగాళ్లు..

350
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో కరక్కాయల పొడిని కొనుగోలు చేస్తామంటూ ఓ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సంస్థ అమాయక ప్రజలకు వలవేసి కోట్ల రూపాయలు వసూలు చేసి ఉడాయించిన విషయం తెలిసిందే. సంచలనం సృష్టించిన కరక్కాయ కేసును ఎట్టకేలకు సైబరాబాద్‌ పోలీసులు ఛేదించారు. వాళ్లు ఉపయోగించిన వాహనం వివరాలు పోలీసులకు దొరకడంతో ఈ కేసును సైబరాబాద్‌ పోలీసులు ఛేదించారు. ఈ కుంభకోణంలో ప్రధాన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడైన మల్లిఖార్జున్‌తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మీడియా ముందు వివరాలను వెల్లడించనున్నట్లు సీపీ వీసీ సజ్జనార్‌ తెలిపారు.

New Twist In Karakkaya Case

గత నెల 16న కేపీహెచ్‌బీలో బాధితులు.. పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఈ మోసం వెలుగు చూసింది. కారక్కాయ పొడి చేసి ఇస్తే అధిక మొత్తం చెల్లిస్తామంటూ వినియోగదారులను నిర్వాహకులు దగా చేశారు. వందల సంఖ్యలో బాధితులు కరక్కాయలపై కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. 10 కోట్లకు పైగా మోసం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. తెలంగాణతో పాటు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పెట్టుబడులు పెట్టారు.

ఈ కేసును సైబరాబాద్‌ పోలీసులు సీరియస్‌గా తీసుకొని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్నాటకల్లో గాలింపు చేపట్టారు. ముఖ్యంగా ప్రధాన సూత్రధారులు నెల్లూరు జిల్లా వాసులన్న సమాచారంతో ప్రత్యేక బృందాలు నెల్లూరులో జల్లెడ పడుతున్నాయి. అక్కడి పోలీసుల సహకారంతో ఈ ముఠా గుట్టును రట్టుచేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.

- Advertisement -