జయరాం హత్య కేసు.. వెలుగులోకి కొత్త నిజాలు

268
Chigurupati Jayaram Case
- Advertisement -

పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారుల విచారణ ముగిసింది. హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ఇద్దరు పోలీసులను ఉన్నతాధికారులు విచారించారు. సీఐ శ్రీనివాస్, ఏసీపీ మల్లారెడ్డిలను బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయంలో పశ్చిమ మండల డీసీపీ ఏఆర్ శ్రీనివాస్, దర్యాప్తు అధికారి కేఎస్‌ రావు ప్రశ్నించారు. అయితే హత్య జరిగిన అనంతరం రాకేశ్‌రెడ్డి ఫోన్‌లో వీరితో ఏం మాట్లాడాడు? అనేదానిపై వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. హత్య విషయం తెలిసి ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదు? రాకేశ్‌రెడ్డితో ఎంత కాలం నుంచి పరిచయం ఉంది? అనేదానిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Chigurupati Jayaram Case

మూడున్నర గంటల పాటు కొనసాగిన ఈ విచారణలో.. రాకేశ్ రెడ్డి సమాధానాలు, పోలీసుల సమాధానాలను అధికారులు బేరీజు వేసుకుంటున్నారు. ఈసందర్భంగా డీసీపీ శ్రీనివాస్ జయరాం హత్య కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. జయరాం హత్యకేసులో ముగ్గురు పోలీసు అధికారులను విచారించాం. ఏసీపీ మల్లారెడ్డి, సీఐలు శ్రీనివాస్, రాంబాబులను విచారించాం. కేసుకు సంబంధించి అధికారుల నుంచి ప్రతీ విషయం తెలుసుకున్నాం.

జయరాం, శిఖా చౌదరికి నగదు లావాదేవీలు ఉన్నాయని దర్యాప్తులో తేలిందన్నారు. ‘‘గతంలో ఆరెకరాలు కబ్జా చేయాలని రాకేశ్‌రెడ్డి కొందరు పోలీసులను సంప్రదించాడు. పోలీసుల ప్రమేయం ఉన్నంత వరకు వారిని విచారిస్తాం. హత్య జరగకముందు, జరిగిన తర్వాత కాల్ డేటా ఆధారంగా ప్రశ్నించాం. రాకేశ్ రెడ్డి తన స్నేహితుల మధ్య గొడవ విషయాన్ని మాత్రమే.. ఫోన్ కాల్‌లో తనకు చెప్పాడని ఏసీపీ మల్లారెడ్డి చెప్పాడు. హత్య గురించి తెలిసినట్లు దర్యాప్తులో తేలితే సదరు పోలీసు అధికారులపై కఠిన చర్యలు చర్యలు తీసుకుంటాం. అని అధికారులు తెలిపారు.

- Advertisement -