SSMB28..అయోధ్యలో అర్జునుడు!

92
ssmb
- Advertisement -

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు – త్రివిక్రమ్‌ శ్రీనివాస్ కాంబోలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా హ్యాట్రిక్ మూవీ కాగా మహేశ్ కెరీర్‌లో 28వది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోండగా సినిమా టైటిల్‌కు సంబంధించి ఆసక్తికర వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది.

తొలుత ఆరంభం అనే టైటిల్‌ని ట్రెండ్ చేయగా తాజాగా మరో టైటిల్‌ ట్రెండింగ్‌లో ఉంది. అయోధ్యలో అర్జునుడు అనే టైటిల్‌ని ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో త్రివిక్రమ్ సెంటిమెంట్ మొదటి అక్షరం ‘అ’, మహేష్ బాబు సెంటిమెంట్ అయిన చివరి అక్షరం ‘డు’ ఉండటంతో ఈ టైటిల్‌ని ఖరారు చేసినట్లు సమాచారం.

ఇందుకు సంబంధించి త్వరలోనే అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -