నకిలీ నోటును కనిపెట్టండిలా..

240
Fake currency
- Advertisement -

దేశ ఆర్ధికా వ్యవస్తను పట్టిపీడిస్తున్న వాటిలో నకిలీ నోట్ల బెడద ఒకటి. కొంతమంది దళారులు నకిలీ నోట్లను ముద్రించి వాటిని మార్కెట్‌ లోకి వదిలి..అక్రమంగా సంపాదనను ముట్టగట్టుకుంటున్నారు. మరో పక్క ఉగ్రవాదులు కూడా దేశ ఆర్ధిక వ్యవస్ధను దెబ్బతీసేందుకు నకిలీ నోట్లును ముద్రించి ప్రజల్లోకి వదులుతున్నారు.

నకిలీ నోట్లను కట్టడిచేయడంతో పాటు..బ్లాక్ మనీని నివారించేందుకే మోదీ పెద్ద నోట్ల రద్దు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే కొత్తగా వచ్చిన 2000 కరెన్సీ కి నకిలీ నోట్ల బెడద ఉండకుండా మోడీ గట్టి చర్యలే తీసుకున్నట్టు తెలుస్తోంది. నకిలీ నోట్లను సులువుగా గుర్తించేందుకు..కొత్త 2000 నోట్లను పక్కా ప్రణాళికంగానే రూపొందించినట్టు ఆర్ధిక మంత్రిత్వశాఖ పేర్కోంది.

Fake currency

కొత్తగా వచ్చిన రూ.2 వేల నోట్ లోని ప్రత్యేకతల గురించి ఇంతకు ముందే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వివరించి చెప్పింది. తాజాగా, ఆ నోట్ లోని ‘ఇంటాగ్లియో’ అనే ఒక సెక్యూరిటీ ఫీచర్ గురించి ఆర్థిక మంత్రిత్వ శాఖ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. ఈ ఫీచర్ లో భాగంగా కాగితంలోకి ఒక రకమైన డిజైన్ ను చొప్పిస్తారని తెలిపింది. రూ.2 వేల నోట్ అసలో, నకిలీయో ఎలా తెలుసుకోవాలనే విషయాన్ని కూడా ప్రజలకు తెలిపింది.

ఒక వస్త్రాన్ని తీసుకుని రెండు వేల నోట్ పై రుద్దితే టర్బో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ పుడుతుందని, తద్వారా ఆ నోట్ లోని ఇంక్ వస్త్రంలోకి బదిలీ కావడంతో చిన్నపాటి షాక్ లాంటిది తగులుతుందని పేర్కొంది. ఈ విధమైన షాక్ తగిలితే ఆ నోట్ ఒరిజినల్ అని, లేకపోతే నకిలీ అని వివరించింది. నకిలీ నోటును సులువుగా గుర్తు పట్టేలా తగిన చర్యలు తీసుకున్నట్టు..ప్రజలకు తెలియజేసింది.

- Advertisement -