25న ‘గని’ వస్తున్నాడు..

77
- Advertisement -

మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘గని’. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్‌ మంగళవారం ప్రకటించింది. ‘గని’ ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టు వెల్లడించింది. అల్లు బాబీ, సిద్ధు ముద్దా సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన సయీ మంజ్రేకర్ కథానాయిక. సునీల్ శెట్టి, జగపతిబాబు, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలకపాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందించారు.

ఈనేపథ్యంలో హీరో వరుణ్‌ తేజ్‌ స్పందించాడు.. మూడేళ్ల పాటు పడిన కష్టానికి ప్రతిఫలం అందుకునే సమయం వచ్చిందని, తప్పకుండా ప్రేక్షకుల ఆదరాభిమానాలు అందుకుంటామన్న నమ్మకం ఉందని వరుణ్ తేజ్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 25న థియేటర్లలో కలుసుకుందాం అంటూ ట్వీట్ చేశాడు.

https://twitter.com/IAmVarunTej/status/1493474455158358018
- Advertisement -