రేషన్ కార్డులు లేని అందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు..ఈ పథకాలన్నీ జనవరి 26, 2025 నుంచి ప్రారంభమవుతాయి అన్నారు. రాజ్యాంగం అమలు జరిగి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ తేదీ నుంచి పథకాలు అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం అన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పథకంలో భాగంగా ఏడాదికి రూ.10 వేలు ఇచ్చింది…కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనలో రైతులందరికీ రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయించాం అన్నారు.
అలాగే భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఏడాదికి రూ.12 వేలు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ఈ పథకానికి ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం’గా నామకరణం చేస్తున్నాం అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రెస్ మీట్ స్క్రోలింగ్ పాయింట్స్.. రాజ్యాంగం అమలు జరిగి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా ఈ పథకాలు అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం అన్నారు.
Also Read:రైతు భరోసా 15 వేలు కాదు 12 వేలే!