తెలంగాణ కొత్తగా రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పిందింది ప్రభుత్వం. మీ-సేవ వెబ్సైట్లో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ నిర్ణయం తీసుకుంది. మీసేవ వెబ్సైట్లో మీ- దరఖాస్తుల స్వీకరణ ఆప్షన్ అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా రేషన్ కార్డులు లేని వారు ఏ సమస్యా లేకుండా మీ సేవ వెబ్సైట్లో కొత్త కార్డులకు దరఖాస్తులు చేసుకునే వీలు కల్పించారు.
అయితే రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నవారు, ప్రజాపాలనలో గానీ, కుల గణనలో గానీ పాల్గొని దరఖాస్తు చేసుకున్నవారు మరోసారి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. తెలంగాణ కేబినెట్ నిర్ణయం మేరకు ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వారికి రేషన్ కార్డులు మంజూరు చేస్తాం. కనుక మరోసారి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు అన్నారు.
ప్రజల అవసరం, రేషన్ కార్డులకు ఉన్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని సోమవారం నాడు పౌరసరఫరాల శాఖ అధికారులు చర్చించి మీసేవ ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని మీసేవ కమిషనర్ కు స్పష్టం చేయడంతో మీసేవ వెబ్ సైట్లో సోమవారం సాయంత్రం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది.
Also Read:కేరళ, తమిళనాడుకు పవన్

