Congress:రేవంత్ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు?

20
- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త పీసీసీ చీఫ్ రాబోతున్నారా? ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ అధిష్టానం ఈ మేరకు నిర్ణయం తీసుకోనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 2021లో టీపీసీసీ చీఫ్‌గా పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి..ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని అధికారంలో తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం సీఎంగా, పీసీసీ చీఫ్‌గా ఉన్నారు రేవంత్.

ఈ నేపథ్యంలో పాలనపై పూర్తి స్థాయి దృష్టి సారించడంలో భాగంగా రేవంత్ స్థానంలో కొత్త పీసీసీ చీఫ్‌ను తీసుకురావాలని భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇందుకోసం ఇప్పటికే కసరత్తు ప్రారంభించగా సీనియర్ నేతలు ఇప్పటికే ఢిల్లీ పెద్దలను కలిసి తమకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు.

ప్రధానంగా పీసీసీ చీఫ్ పదవిని ఆశీస్తున్న వారిలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మధుయాష్కి,అద్దంకి దయాకర్, అంజన్ కుమార్‌ యాదవ్‌లతో పాటు పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. బీసీ సామాజిక వర్గానికి పీసీసీ పదవి ఇస్తే తనకే ఇవ్వాలని కోరుతున్నారు మధుయాష్కి. ఇందుకోసం తన కమ్యూనిటీ కార్డును ఉపయోగిస్తున్నారు. వీరితో పాటు మరికొంతమంది పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో కొత్త పీసీసీ చీఫ్ ఎవరు అవుతారోనని కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Also Read:Chiru:’రాజు యాదవ్’ అలరిస్తుంది..

- Advertisement -