త్వరలోనే కొత్త పాన్ కార్డులు.. పాతవన్నీ రద్దు!

13
- Advertisement -

కేంద్ర మంత్రివర్గం సంచలన నిర్ణయం తీసుకుంది. పాన్ కార్డు విషయంలో మంత్రివర్గం కీలక నిర్ణయానికి ఆమోదం తెలిపింది. పాన్ 2.0కి కేంద్ర కెబినెట్ ఆమోదం తెలిపింది. ఇది QR కోడ్‌తో పాన్ కార్డ్‌కు ఉచితంగా అప్‌గ్రేడ్ చేయబడుతుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.

అధికారిక ప్రకటన ప్రకారం.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCEA), ఆదాయపు పన్ను శాఖ యొక్క పాన్ 2.0 ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలిపింది. రూ.1,435 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.

PAN 2.0 ప్రాజెక్ట్ అనేది పన్ను చెల్లింపుదారులకు మరిత మెరుగైన డిజిటల్ అనుభవం కోసం PAN/TAN సేవల సాంకేతిక పరివర్తన ద్వారా పన్ను చెల్లింపుదారుల రిజిస్ట్రేషన్ సేవల వ్యాపార ప్రక్రియలను రీ-ఇంజనీరింగ్ చేయడానికి ఇ-గవర్నెన్స్ ప్రాజెక్ట్.

Also Read:‘గేమ్ చేంజర్’.. థర్డ్ సింగిల్

- Advertisement -