సవరించిన పురపాలక సంఘం చట్టం కఠినంగా ఉంటుందని…సవరించిన చట్టాన్ని రెండు సభలు ఆమోదించాయని తెలిపారు మంత్రి కేటీఆర్. నల్గొండ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో పురపాలక శాఖ సమీక్షా సమావేశం జరుగగా ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ ఉద్యోగులను బెదిరించి పనులు చేయించాలనుకోవడం ప్రభుత్వ అభిమతం కాదని..ఈ చట్టం పై ముందుగా ఉద్యోగులలో అవగాహన పెంచాలన్నారు.
టీఆర్ఎస్‌ది ఫ్రెండ్లి ప్రభుత్వమని తెలిపారు.ఇకపై భవనాల నిర్మాణాలకు అనుమతులు సులభతరం కానున్నాయని 75 గజాలలో ఇండ్లునిర్మించుకునే వారికి అనుమతులు అవసరం లేదన్నారు.స్వీయ నియంత్రణతో వారికి వారే ట్యాక్స్ నిర్ణయించుకోవచ్చు…వీరి నుండి 75 రూపాయల నామమాత్రపు ట్యాక్స్ వసూలు చేయాలన్నది ఈ చట్టంలో ఉందన్నారు.
75 నుండి 600 గజాలలో ఇండ్లు నిర్మించుకునే వారికి 21 రోజులలో అనుమతులు ఇవ్వాలని…స్వీయ ధ్రువీకరణ పత్రాలలో తప్పులు దొర్లితే మొదటి వారంలో నే రిజెక్ట్ చెయ్యాలి…21 రోజుల వరకు కమిషనర్లు స్పందించక పోతే వారికి అనుమతులు లభించినట్లే ఈ తరహా ఎక్కువగా ఉన్నప్పుడు సదరు కమిషనర్ పై చర్యలు తప్పవని హెచ్చరించారు.
దశాబ్దాలుగా పురపాలికలలో పేరుకు పోయిన సంస్కృతి నుండి బయట పడాలన్నదే కొత్త చట్టం ముఖ్య ఉద్దేశం అని పనితీరును పట్టి సిబ్బందిని వేరే ప్రాంతాలకు బదిలీ చేసే అవకాశం ఉందన్నారు.తప్పులు చేసే వారికి వెన్నులో భయం ఉండాలన్నారు.
పురపాలక సంఘాల అభివృద్ధి కి వనరులు సమృద్ధిగా ఉన్నాయని ఫైనాన్స్ కమిటీ సిఫారసు చేసిన ప్రతి పైసాకు రాష్ట్ర ప్రభుత్వం పైసా కలుపుతుందన్నారు.14 వ ఆర్థిక సంఘం నుండి రాష్ట్రంలోని పురపాలక సంఘాలకు 1036 కోట్లు రావాలి అందుకు రాష్ట్ర ప్రభుత్వం నుండి 1036 కోట్లు కలిపితే 2072 కోట్లు వనరులు అందుబాటులో ఉంటాయని చెప్పారు.
ప్రతీ పురపాలక సంఘం పరిధిలో విధిగా గ్రీన్ యాక్షన్ ప్లాన్ ఉండాలి….విధిగా 10% బడ్జెట్ లో కేటాయింపులు ఉండాలి ఆపైన కూడా పెట్టుకోవచ్చన్నారు. పట్టణాల పరిశుభ్రత పై దృష్టి సారించాలని…కొత్తగా వచ్చిన చట్టంలో తప్పులు చేస్తే ప్రజలకు పై కూడా చర్యలు తప్పవన్నారు. సవరించిన చట్టాన్ని మూడు భాషలలో కరపత్రాలద్వారా ప్రజలకు తెలియ చేయాలని…వార్డుల వారీగా కమిటీలు వెయ్యాలి…సీనియర్ సిటిజన్ లతో పాటు మహిళాసంఘం,యువజన సంఘం లతో పాటు రెసిడెన్షియల్ సంక్షేమ సంఘాలు ఏర్పాటు చేయాలన్నారు.ఈ సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి,జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి ,ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి,ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, కిశోర్ కుమార్ ,నోముల నర్సింహయ్య,రవీంద్ర నాయక్ ,భాస్కర్ రావు,చిరుమర్తి లింగయ్య, బొల్లం మల్లయ్య యాదవ్‌తో పాటు అధికారులు పాల్గొన్నారు.