కొత్తగా పెళ్లి చేసుకున్నారా..ఇవి తెలుసుకోండి!

20
- Advertisement -

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి లైఫ్ లో ఎంతో ప్రత్యేకం. అంతకుముందు సింగిల్ జీవితంలో ఎంతో స్వేచ్చ గడిపి పెళ్లి తర్వాత ఇంకొకరిని జీవితంలోకి ఆహ్వానించాల్సి ఉంటుంది. ఇద్దరు కలిసి ఒకరికొకరు సంసార సాగరంలో ముందుకు సాగాల్సి ఉంటుంది. అయితే నేటి రోజుల్లో చాలా మంది పెళ్లి చేసుకున్న నెల లేదా రెండు నెలలకే విడాకుల దిశగా అడుగులు వేస్తున్నారు. ఇలా విడాకులు తీసుకుంటూ నూరేళ్ళ బంధానికి అడ్డుకట్ట వేస్తున్నారు. అయితే విడాకులు తీసుకోవడానికి కారణాలు చాలానే ఉన్నప్పటికి ప్రధానంగా ఒకరిపై ఒకరికి వచ్చే అభిప్రాయ భేదాలే అసలు కారణం అని నివేదికలు చెబుతున్నాయి. కాబట్టి కొత్తగా పెళ్లి చేసుకున్న వారు కొన్ని సూచనలు పాటించడం ఎంతో ముఖ్యం. అవేంటో తెలుసుకుందాం !

* ప్రతి విషయాలను భాగస్వామితో చర్చించడం అలవాటు చేసుకోవాలి. సాధారణంగా కొత్తగా పెళ్ళైన వారు భర్త లేదా భార్య వద్ద సిగ్గు, బిడియం కారణంగా అన్నీ విషయాలను పంచుకోవడంలో వెనకడుగు వేస్తుంటారు. నిజానికి భాగస్వామితో అని విషయాలు చర్చించడం వల్ల అభిప్రాయాలు బహిర్గతం అవుతాయి. తద్వారా వాటికనుగుణంగా నడుచుకునే వీలు ఉంటూంది.

* ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించడం ఎంతో ముఖ్యం. తినే ఆహారం విషయం లోనూ, ఇంటి పనులు చేసుకోవడంలోనూ, ఇంకా ఫ్రెండ్స్ తో టైమ్ గడపడంలోనూ భార్య భర్తలు ఇద్దరు ఒకరి ఫ్రీడం ను మరొకరు గౌరవిస్తూ నడుచుకోవాలి.

* చాలమంది భర్తలు భార్యల పట్ల డామినేషన్ కనబరిచే ప్రయత్నం చేస్తూ, భార్యపై కోపం చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల భార్య మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి భార్య పట్ల ప్రేమను కనబరుస్తూ ఎలాంటి విషయాలైన ఆమెకు అర్థమయ్యేలా వివరించాలి.

* కొందరు ఆడవారు వారి భర్త విషయంలో షరతులు విధిస్తుంటారు. అయితే ఆ షరతులు భర్తకు ఇబ్బందులకు గురి చేస్తే ఇద్దరి మద్య దూరం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి భర్తను అర్థం చేసుకునే విధంగా భార్య వ్యవహరించాలి.

* దాంపత్య జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనది ఒకరిపై ఒకరికి నమ్మకం. కాబట్టి ఇరువురు కూడా వారి యొక్క భార్య లేదా భర్త విషయంలో నమ్మకం కలిగి ఉండాలి.

ఇలా కొన్ని సూచనలను కొత్తగా పెళ్ళైన వారు పాటిస్తే వారి దాంపత్య జీవితం సంతోషంగా సాగుతుందనేది చాలామంది చెప్పే మాట.

Also Read:Devara:దేవర..అసలేం జరుగుతోంది?

- Advertisement -