- Advertisement -
ఈ నెల 29న మరో అల్పపీడనం ఏర్పడనుందని తెలిపారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు. ఆగ్నేయ బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంపైన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపారు. దీని ప్రభావంతో పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది వాతావరణ శాఖ.
అయితే రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణమే ఉంటుందని తెలిపారు. అల్పపీడన ప్రభావంతో కేరళ రాష్ట్రంతో పాటు తమిళనాడు, పుదుచ్చేరి, కోస్తాంధ్ర, కర్ణాటక రాష్ట్రాల్లో తొలుత వర్షాలు పడతాయని తెలిపారు.
ఈనెల 28వ తేదీ నాటికి రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల నుంచి, దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి కూడా నైరుతి రుతుపవనాల ఉపసంహరణ పూర్తయ్యే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.
- Advertisement -