అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం ఎఫ్ 3. ఎఫ్2కి సీక్వెల్గా వచ్చిన ఈ చిత్రం ఇటీవలె వందకోట్ల క్లబ్లో చేరింది. ఇక ఈ సినిమా సక్సెస్ను తెగ ఎంజాయ్ చేస్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఎఫ్ 4 సినిమా రెండేళ్ల తర్వాత ఉంటుందని, హీరోయిన్లు మాత్రం మారతారని అన్నారు.
ఇక సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు తమన్నా దూరంగా ఉండటంపై రూమర్స్ వెలువడగా దానిపై క్లారిటీ ఇచ్చారు అనిల్. ఒకరోజు తమన్నా చాలా మంది ఆర్టిస్టులతో ఒక సన్నివేశం షూట్ చేయాల్సి వచ్చింది. కానీ అప్పుడు తన సమయం దాటిపోయింది అని, నెక్స్ట్ డే జిమ్ కి వెళ్ళాలని అందుకే వెళ్ళిపోతానని చెప్పింది. దీంతో మా మధ్య చిన్న డిస్టర్బన్స్ వచ్చింది. దాని వల్ల రెండు మూడు రోజులు మా మధ్య పెద్దగా మాటలు లేవని తెలిపారు. కానీ నా సినిమా కాబట్టి నేనే మళ్లీ వెళ్లి మాట్లాడేశాను. ఇప్పుడు మేము బాగానే ఉన్నాము. తను వేరే సినిమా షూటింగ్ తో బిజీగా ఉండడం వల్ల ప్రమోషన్స్ కి రాలేకపోయిందని తెలిపారు అనిల్.