రైతులకు ఆదాయం పెరిగి, అధిక లాభాలు సాధించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత్రిత సాగు విధానానికి రూపకల్పన చేసారని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు..సూర్యాపేట జిల్లా హుజుర్నగర్ లో నిర్వహించిన వానాకాలం సాగు సన్నద్ధత సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి రైతులు సంఘటితం కావాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.
ఉద్యమ సమయం నుంచే సీఎం కేసీఆర్ వ్యవసాయo లో సంస్కరణలు తీసుకొచ్చేలా అధ్యయనం చేసారని జగదీష్ రెడ్డి అన్నారు..అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు లు కట్టి రైతులకు పుష్కలంగా నీరు అందించి, 24 గంటల కరంట్ ఇచ్చి, రైతు బంధు ఆర్ధిక చేయిత అందించారని అన్నారు.. వ్యవసాయముతో పాటు దాని అనుబంధ రంగాలను సీఎం కేసీఆర్ పరిపుష్టం చేసారని అన్నారు…ప్రస్తుతం తెలంగాణ లో అమలు చేస్తున్న నియంత్రిత సాగు విధానం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని, ధర నిర్ణయించే శక్తి రైతులకు రాబోతున్నదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.
హుజుర్నగర్ నియోజకవర్గంలో కూరగాయలు సాగును బాగా పెంచాలని, అందుకు అనుగుణంగా వ్యవసాయాధికారులు రైతులకు అవగాహన కల్పించాలని మంత్రి కోరారు…కూరగాయల సాగుతో రైతులకు లక్షల ఆదాయం వస్తుందని అన్నారు..ఇప్పటి నుంచి తెలంగాణ లో ప్రణాళిక బద్దంగా వ్యవసాయం జరుగుతుందని, తెలంగాణ రైతులు ధనవంతులు అవుతారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు… డిమాండ్ ఉన్న పంటలను మాత్రమే సాగు చేసి,వ్యవసాయన్నీ లాభసాటిగా మార్చే అద్భుతమైన అవకాశం ఈ నియంత్రిత సాగు విధానం ద్వారా వచ్చిందని, రైతులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు…ప్రతి రైతుకు తప్పనిసరిగా రైతు బంధు డబ్బులు అందిస్తామని ,ప్రతిపక్షాలు సృష్టించే అపోహలను నమ్మవద్దని మంత్రి రైతులను విజ్ఞప్తి చేశారు.