ఉదయనిధిపై సీరియస్ కామెంట్స్

15
- Advertisement -

తమిళనాడు మంత్రి ఉదయనిధి సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై సీరియల్ నటి కస్తూరి ట్విట్టర్ వేదికగా స్పందించింది. ‘‘మీ కుటుంబంలో డెంగ్యూ, మలేరియా వ్యాప్తి చెందుతాయి. మీరు వాటితో ఏమి చేయాలనుకుంటున్నారు ?, సనాతన ధర్మంపై అంత ద్వేషం ఉన్నవారికి, హిందూ దేవాలయాల ఆస్తులతో ప‌నేంటి, వాటిని మాత్రమే అడుగుతారా?’’ అంటూ ట్వీట్ చేసింది. మొత్తానికి ఉదయనిధి పై మండిపడ్డ నటి కస్తూరి సీరియస్ కామెంట్స్ చేసింది.

అలాగే పనిలో పనిగా శ్రీరెడ్డి కూడా ఉదయనిధి పై విరుచుకు పడింది. అసలు శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కాస్టింగ్ కౌచ్ గురించి ఉద్యమం చేసి ఎందరో స్టార్ హీరోల మీద హాట్ కామెంట్స్ చేసి పాపులారిటి దక్కించుకుంది. తాజాగా ఉదయనిధి స్టాలిన్ పై కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘ఉదయనిధి నాకు ఛాన్స్ ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. నాతో అవసరం తీరాక మరిచిపోయాడు’ అని కామెంట్స్ చేసింది. మొత్తమ్మీద ‘సీఎం కొడుకు నన్ను వాడుకున్నాడు’ అంటూ శ్రీరెడ్డి రెచ్చిపోవడం హాట్ టాపిక్ అయింది.

ఏది ఏమైనా సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా మత, రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. ఈ నేప‌థ్యంలో సనాతన ధర్మాన్ని ఉద్దేశించి 2020లో మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌ చరణ్‌ చేసిన ఒక పోస్టు ప్రస్తుతం వైర‌ల్‌ గా మారింది. కోలీవుడ్‌లో ఉదయనిధి స్టాలిన్‌ హీరోగా రాణిస్తున్నాడు. అయితే, ఇకపై సినిమాల్లో నటించనంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Also Read:జీ20 సమ్మిట్‌కు బైడెన్!

- Advertisement -