బీజేపీపై బండి సర్జికల్ స్ట్రయిక్స్‌!

191
bjp
- Advertisement -

సర్జికల్ స్ట్రయిక్స్‌…ఎన్నికలు వచ్చాయంటే వినబడే పేరు. బీజేపీ ప్రధానా ఆయుధం. దీనిని బేస్ చేసుకుని ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టడం దానికి వాట్సాప్ యూనివర్సిటీలో ప్రచారం చేస్తూ దేశభక్తి,పాకిస్థాన్‌ అంటూ కలరింగ్ ఇవ్వడం. అభివృద్ది లేదు తొక్కలేదు. ఒక్కటే అస్త్రం. కులం, మతాన్ని రెచ్చగొట్టి లబ్దిపొందడం. ఇదే బీజేపీ స్టాండ్. ఏ ఎన్నికలైనా సరే నో డెవలప్‌మెంట్ ఓన్లీ సర్జికల్ స్ట్రయిక్స్‌,దేశం కోసం,ధర్మం కోసం. ఇదే విధానాన్ని కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అనుసరిస్తున్నారు కాషాయవాదులు. ఇక ఇతర మతాలున్న చోట వీరి పని చాలా సింపుల్.

ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ బీజేపీ సోకాల్డ్ లీడర్ బండి సంజయ్ సార్ చెప్పిన మాట కూడా ఇదే. హైదరాబాద్‌పై సర్జికల్ స్ట్రయిక్ చేస్తాం…రోహింగ్యాలను తరిమేస్తాం అంటూ ఉకదంపుడు ఉపన్యాసాలతో ఉదరగొట్టారు. తీరా ఎన్నికల్లో బీజేపీకి కాసింత ప్లస్‌ అయినా ప్రజలు అధికారం ఇవ్వకపోవడంతో సర్జికల్ స్ట్రయిక్‌ని అటకెక్కించారు.

కాసింత గ్యాప్..ప్రస్తుతం జరుగుతున్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో రోహింగ్యాల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. అయితే ఈసారి వారిపై దాడులు కావు. ఆదుకోవడం,సానుభూతి. బెంగాల్ ఎన్నికల్లో లబ్ది పొందేందుకు రోహింగ్యాలకు రూ. 10 వేల సాయం అందిస్తామని ప్రకటించారు. ఒకటే పార్టీ ఎంతతేడా… ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం అంటే ఇదికాదా.ఇది అలా ఉంచుదాం.

ఇక బీఫ్ తినేవారు లం….కొడుకులు అని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆ పార్టీ నేతలు మాట్లాడక పోయిన ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో కపట కాషాయ నేతలు ఇచ్చిన హామీలు ఓ సారి పరిశీలిద్దాం. అరుణాచల్ ప్రదేశ్‌ ఎన్నికల్లో బీఫ్‌పై నిషేదం ఉండదు. మేఘాలయ ఎన్నికల్లో బీఫ్ తినడంపై ఆంక్షలు ఉండవు.అస్సాం ఎన్నికల్లో బీఫ్ జాతీయ ఆహారం. కేరళ ఎన్నికల్లో నాణ్యమైన,పరిశుభ్రమైన బీఫ్‌ సరఫారం చేస్తాం,గోవాలో బీఫ్ కొరత రాకుండా చూసుకుంటాం. కానీ ఇతర రాష్ట్రాల్లో బీఫ్ పేరుతో దాడులు చేసి దళితులను,మైనార్టీలను చంపేస్తారు. ఇష్టం వచ్చినట్లు తిడతారు. బీఫ్ తినేవాళ్లనే లం….కొడుకులు అన్న రాజాసింగ్..మరి అమ్మేవారిని,దానికి మద్దతిస్తున్న పార్టీని ఏమంటారో చెప్పాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

పేరుకే జాతీయవాదం… అనుసరించేదేమో కులం,మతం పేరుతో విద్వేశాలు రెచ్చగొట్టడం దానికి సింపుల్‌గా దేశం కోసం,ధర్మం కోసం అని కలరింగ్ ఇవ్వడం వారికి అలవాటుగా మారిందని మండిపడుతున్నారు. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో గ్రేటర్ ఎన్నికల్లో సర్జికల్ స్ట్రయిక్స్ అని గొంతు చించుకున్న బండి అండ్ బ్యాచ్‌కి ప్రశ్నలు సంధిస్తున్నారు నెటిజన్లు. రోహింగ్యాలపై సర్జికల్ స్ట్రయిక్స్‌ ఎప్పుడూ చేస్తారా లేదా అదే రోహింగ్యాలను కాపాడుకుంటూ వస్తున్న బీజేపీపై సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తారా చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -