తమన్నా కామెంట్స్ పై నెటిజన్లు సీరియస్

50
- Advertisement -

చదువుకునే రోజుల్లో రౌడీలా ఉండేదాన్ని అని హీరోయిన్ తమన్నా వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో నేను అబ్బాయిలా నడుస్తున్నానని.. అమ్మాయిలా నడవాలని ఓ నిర్మాత చెప్పారు’ అని గుర్తుచేసుకున్నారు. అమ్మాయిలా వయ్యారంగా నడవడం, హావభావాలు పలికించడం నేర్చుకోవడానికి చాలా కష్టపడ్డానని చెప్పారు. చీరతోనే డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేదాన్నని తమన్నా చెప్పుకొచ్చింది.

అలాగే తెలుగు హీరోలను తమన్నా ప్రశంసల్లో ముంచెత్తింది.”తెలుగు హీరోలు సంస్కారవంతులు. మహిళల పట్ల మర్యాదగా వ్యవహరిస్తారు. సెట్‌లో హీరోయిన్‌ల పట్ల అపార గౌరవంతో ఉంటారు.ఇది వాళ్ల ఇంట్లో తల్లిదండ్రుల నుంచి నేర్చుకుని ఉంటారు. ఈ విషయంలో ఇతర భాషల హీరోలకు, తెలుగు హీరోలకు చాలా తేడా ఉంటుంది. అందుకే వాళ్లతో నటించడానికి హీరోయిన్లు పోటీపడతారు” అని ఓ హిందీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా తెలిపింది. తమన్నా కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Also Read:శివకార్తికేయన్…’మహావీరుడు’

అయితే, తమన్నా తెలుగు హీరోలను మెచ్చుకోవడం పై బాలీవుడ్ అభిమానులు సీరియస్ అవుతున్నాయి. ఆవిడ మంచిది అంటే.. ఈవిడ చెడ్డది అనేగా అర్థం అంటూ తమన్నా పై విరుచుకు పడుతున్నారు. మరోవైపు తమన్నా లస్ట్ స్టోరీస్ 2 లో విచ్చలవిడిగా బోల్డ్ సన్నివేశాల్లో నటించింది. కేవలం డబ్బు ఎక్కువ వస్తోంది అని అలాంటి సీన్స్ లో నటించిన నీలాంటి దాని మాటలు మేం నమ్మం అంటూ బాలీవుడ్ నెటిజన్లు తమ్ము పై సీరియస్ అవుతున్నారు.

Also Read:రామ్ పోతినేని..’స్కంద’ రిలీజ్ డేట్

- Advertisement -