- Advertisement -
మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అయ్యారు. నెటిజన్ల ఆగ్రహానికి కారణం మిథాలి వేసుకున్న డ్రస్సే. ఆమె డ్రస్ విషయంలో వీరు అభ్యంతరం వ్యక్తం చేశారు. మిథాలీ తన స్నేహితులతో కలిసి దిగిన ఓ ఫొటోను సోషల్మీడియాలో పోస్ట్ చేశారు.ఆ ఫొటోలో ఉన్న అందరి దుస్తులు బాగానే ఉన్నాయి.
కానీ.. మిథాలీ వేసుకున్న దుస్తులు మాత్రం అసభ్యకరంగా ఉన్నాయని, కెప్టెన్ అయివుండి ఇలాంటి దుస్తులేంటి అంటూ మిథాలీకి కొంతమంది క్లాస్ పీకారు. అంతేకాకుండా..అటువంటి డ్రెస్సులు వేసుకోవడానికి నువ్వేమైనా సినిమా హీరోయిన్ వా? అని ప్రశ్నలు వేస్తున్నారు.
అంత గ్లామరస్ గా కనిపించాల్సిన అవసరం ఏంటని అడుగుతున్నారు. కాగా, గత నెలలోనూ ఇదే తరహా బోల్డ్ ఫోటో పెట్టినప్పుడు వచ్చిన కామెంట్లపై ఆగ్రహంతో స్పందించిన మిథాలీ, తాజా కామెంట్స్ పై మాత్రం నోరు విప్పలేదు.
- Advertisement -