బిగ్‌బాస్ సీజన్-7 మూడు వారాలు పూర్తి చేసుకుని నాలుగో వారంలోకి ఎంటర్ అయింది. 3వ వారంలో సింగర్ దామిని హౌస్ నుంచి బయటకు వచ్చింది. ఐతే, 3 వారాల పాటు హౌస్‌లో ఉన్నందుకు దామిని పెద్ద మొత్తంలోనే సంపాదించిందని టాక్. ఆమె వారానికి రూ.2 లక్షల మేర రెమ్యునరేషన్ అందుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కన దామిని రూ.6 లక్షలు బిగ్ బాస్ నుంచి రెమ్యునరేషన్‌గా అందుకున్నట్లు తెలుస్తోంది. అయితే, నెటిజన్లు మాత్రం దామినికి రెమ్యునరేషన్ చాలా తక్కువ ఇచ్చారని.. కేవలం ఆమె చేసిన ఎక్స్ పోజింగ్ కే దామినికి 20 లక్షలు ఇవ్వొచ్చు అని కామెంట్లు పెడుతున్నారు.
నెటిజన్లు మెసేజ్ లు పెట్టినట్టుగానే దామిని కూడా తన హాట్ అందాలతో కను విందు చేస్తుంది. పొట్టి పొట్టి దుస్తుల్లో దామిని తన అందాలను అస్సలు దాచుకోలేదు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా దామిని తన ఎక్స్ పోజింగ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. బోల్డ్ గా ఉంటే తప్పేం ఉంది ? అంటూ కామెంట్స్ చేసింది. మరి సినిమాల్లో నటిస్తారా ? అంటే.. అవకాశం వస్తే కచ్చితంగా నటిస్తాను అని దామిని చెప్పుకొచ్చింది. ఐతే, లావుగా ఉండటంతో పాటు హైట్ కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి.. దామినికి మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ రాకపోవచ్చు.
Also Read:Tirumala:వైభవంగా శ్రీవారి రథోత్సవం
ఇదే విషయం పై కూడా దామిని తన సన్నిహితుల దగ్గర రియాక్ట్ అయ్యిందట. ఐటమ్ పాత్రలు చేయడానికి కూడా తాను రెడీగా ఉన్నాను అని దామిని చెప్పడం విశేషం. ఇక బిగ్ బాస్ విషయానికి వస్తే.. తాజాగా నామినేషన్స్‌పై బిగ్‌బాస్ ప్రోమో వచ్చేసింది. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయని అన్నావంటూ రతిక శివాజీతో వాదనకు దిగింది. మరోవైపు బిగ్‌బాస్ కొత్త తరహా నామినేషన్ ప్రవేశపెట్టాడు. ఈ హౌస్‌లో సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల గురించి మాట్లాడకూడదన్న రూల్ ఉందని, దాన్ని రతిక అతిక్రమించిందని శుభశ్రీ పేర్కొంది.
Also Read:మధుమేహాన్ని గుర్తించే లక్షణాలు ఇవే!