బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభమైన దగ్గరి నుండి సోషల్ మీడియాలో సెటైర్లు వస్తున్న సంగతి తెలిసిందే. బండి సంజయ్ మాటలు,యాత్రలో నామమాత్రంగా ప్రజలను కలిసే తీరు,యాత్రలో కాలి వేలికి గాయం వంటి అంశాలపై ఇప్పటివరకు సోషల్ మీడియా వేదికగా విసుర్లు వేస్తున్న నెటిజన్లు తాజాగా బండికి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు.
యాత్రలో భాగంగా బండి ఊరూరా తిరుగుతూ చేప పిల్లలు, గొర్రెలు, నీటిని తాగుతూ ఫోటోలు దిగగా అవి వైరల్‌గా మారాయి. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పథకాలను బండి సంజయ్ ప్రచారం చేస్తున్నారని నెటిజన్లు ఆయనకు జ్ఞానబోధ చేస్తున్నారు.
ఎలాగా అంటే కేసీఆర్ పంపిణీ చేసిన చేప పిల్లలు, కేసీఆర్ పంపిణీ చేసిన గొర్రెలు, కేసీఆర్ ఇచ్చిన మిషన్ భగీరథ నీళ్ళు తాగుతూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే కర్రుకాల్చి వాతపెడతారని ఆ ఫోటోలను షేర్ చేస్తూ బండికి కౌంటర్ ఇస్తున్నారు. ఇక ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌ని మంత్రి కేటీఆర్ లైక్ చేయడంతో మరింత వైరల్‌గా మారింది.