ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్‌..ఎలానో తెలుసా?

5
- Advertisement -

కరోనా లాక్ డౌన్ తర్వాత ఓటీటీలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. సినిమాల్లో విడుదలైన కొద్ది రోజుల్లోనే ఓటీటీల్లోకి వస్తుండగా ఫుల్ గిరాకీ పెరిగిపోయింది.ఇక ఓటీటీల్లో పాపులర్ అయిన సంస్థ నెట్ ఫ్లిక్స్. సినిమాలే కాదు ఒరిజినల్ వెబ్ సిరీస్‌ లతో ప్రేక్షకులను ఆకట్టుకుంది నెట్‌ ఫ్లిక్స్. ప్రపంచవ్యాప్తంగా యూజర్ బేస్ 100 కోట్లకు పైగానే ఉంది.

ఇక ఇప్పటివరకు నెట్‌ ఫ్లిక్స్‌ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ కోసం ఛార్జ్ చేయగా ఇప్పుడు దీనిని ఫ్రీగా పొందొచ్చు. కొన్ని టెలికాం కంపెనీలు ఉచితంగా ఈ ఓటీటీని అందిస్తున్నాయి. మీరు ఎంచుకున్న రీఛార్జ్ ప్లాన్‌లతో Netflixకి కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చు.

రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా ఇలా టెలికాం కంపెనీలు ఎంపిక చేసిన రీఛార్జ్ ప్లాన్‌లలో ఉచిత నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తున్నాయి. జియో రూ. 1,299 రీఛార్జ్ ప్లాన్,రూ. 1,799 రీఛార్జ్‌లతో ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్‌ని ఎంజాయ్ చేయవచ్చు.

Also Read:వయనాడ్ బాధితులకు ప్రభాస్ భారీ విరాళం..

- Advertisement -