నెట్ ఫ్లిక్స్ …పిట్ట కథలు

129
piita kathalu
- Advertisement -

ఆధునిక స్వాతంత్ర్య‌ భావాలు గల విలక్షణమైన మహిళల గురించి ఒక కథా సంకలనాన్ని నడిపించడానికి అద్భుతమైన ప్రతిభావంతులైన న‌లుగురు ద‌ర్శ‌కులు నాగ్ అశ్విన్‌, బి.వి.నందిని రెడ్డి, తరున్ భాస్కర్, సంక‌ల్ప్‌ రెడ్డిల‌ను ఒక చోట చేర్చింది నెట్‌ఫ్లిక్స్‌. .నెట్‌ఫ్లిక్స్ ఈరోజు త‌న మొద‌టి ఒరిజ‌న‌ల్ తెలుగు ఫిలిం ‘పిట్ట‌క‌థ‌లు’ ప్ర‌క‌టించింది. ఈ నాలుగు భాగాల ఆంథాల‌జీ చిత్రానికి న‌లుగురు తెలుగు సినిమా అత్యుత్తమ ద‌ర్శ‌కులు నాగ్ అశ్విన్‌, బి.వి.నందిని రెడ్డి, తరున్ భాస్కర్, సంక‌ల్ప్‌ రెడ్డిలు దర్శకత్వం వహించారు. సాధార‌ణంగా తెలుగులో చిన్న చిన్న క‌థ‌ల‌ను పిట్ట‌క‌థ‌లు అని పిలుస్తాం. ఈ నాలుగు స్టోరీస్ నిర్దిష్ట భావాలు గల న‌లుగురు మ‌హిళ‌ల గురించి చెబుతుంది. ఈ నాలుగు పాత్ర‌ల‌కు ప్రాణం పోయ‌డానికి ఈషా రెబ్బా, లక్ష్మి మంచు, అమ‌లా పాల్‌, మ‌రియు శృతిహాస‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టించారు. అలాగే అషిమా న‌ర్వాల్‌, జ‌గ‌ప‌తిబాబు, స‌త్య‌దేవ్‌, సాన్వే మేఘన, సంజిత్ హెగ్డే త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు.

రోనీ స్క్రూవాలా యొక్క RSVP మూవీస్ మరియు ఆశి దువా సారా యొక్క ఫ్లయింగ్ యునికార్న్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించిన పిట్టకథలు 190 దేశాలలో నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 19న ప్రత్యేకంగా ప్రదర్శించబడుతుంది.నేష‌న‌ల్ ఫిలిం అవార్డు గ్రహీత తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ “పిట్ట కథలు ఫిలింలోని ప్ర‌తి క‌థ దేశంలోని ఒక్కో అందమైన సంస్కృతిని ఆవిష్కరిస్తుంది. మహిళల నేతృత్వంలోని ఈ కథలు ప్రేక్షకులను అల‌రిస్తాయి. ఎంతో ప్రతిభావంతులైన దర్శకులతో, నటులతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది ప్రాంతీయ భారతీయ కంటెంట్ ను ప్రపంచ వేదికపై ప్రకాశింప‌జేసే స‌మ‌యం” అన్నారు.

ప్ర‌ముఖ ద‌ర్శ‌కురాలు బి.వి.నందిని రెడ్డి తన మొదటి నెట్‌ఫ్లిక్స్ చిత్రం గురించి మాట్లాడుతూ – “నెట్‌ఫ్లిక్స్‌తో క‌లిసి ప‌ని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. పిట్ట‌క‌థ‌లు చిత్రానికి ఇంత మంచి తారాగ‌ణం కుద‌ర‌డం నిజంగా గొప్ప విష‌యం. కొత్త మార్గాల్లో ప్రయాణించాలనుకునే ప్రతిభావంతులైన దర్శకులతో క‌లిసి ప‌ని చేయ‌డం ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇది మానవ సంబంధాలను, కథలను సహజంగా, ఒక కొత్త కోణంలో చూపించడానికి దోహద పడింది. నెట్‌ఫ్లిక్స్ లాంటి భారీ వేదిక ఈ క‌థ‌ల‌ను గ్లోబల్ ప్రేక్షకులకు దగ్గిర చేస్తుంది.” అన్నారు.

ఫిలింఫేర్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ – నెట్‌ఫ్లిక్స్ మొదటి తెలుగు ఒరిజినల్ ఫిలిం పిట్ట‌క‌థ‌లు, ప్రేక్షకుల అభిరుచిని మరింత విస్తృత పరిచేలా ఉంటుంది . ఈ న‌లుగురు ద‌ర్శ‌కులు సృష్టించిన నాలుగు వేర్వేరు కథలు కేవ‌లం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్ర‌తి ఒక్క‌రికీ కనెక్ట్ అవుతాయి అన్నారు.

నేషనల్ ఫిల్మ్ అవార్డు గెలుచుకున్న దర్శకుడు సంకల్ప్ రెడ్డి మాట్లాడుతూ – “నా మొదటి నెట్‌ఫ్లిక్స్ చిత్రం పిట్టకథలు ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ నాలుగు కథలు నాలుగు ప్రత్యేకమైన ఇతివృత్తాలతో క‌లిగి ఉండి ప్రేక్షకుల‌కు ఆసక్తి కలిగిస్తాయి. నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఈ కథలు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల ప్రేక్షకుల వ‌ర‌కు ప్రయాణించగలవని న‌మ్మ‌కం ఉంది“ అన్నారు

నెట్‌ఫ్లిక్స్ ఇండియా ఇంటర్నేషనల్ ఒరిజినల్ ఫిల్మ్స్ డైరెక్టర్ సృష్టి బెహ్ల్ ఆర్య మాట్లాడుతూ – “గొప్ప కథలు ఎక్కడి నుండైనా రావచ్చు. మేము దేశం న‌లుమూల‌లకు చెందిన క‌థ‌ల‌ను చెప్పి మా ఫిల్మ్ స్లేట్‌ను విస్తరించాల‌నుకుంటున్నాము. ఈ క్ర‌మంలో భిన్నమైన శైలి కలిగిన తెలుగు స్టోరీ టెల్లింగ్ ను ‘పిట్టకథలు’ ద్వారా నెట్‌ఫ్లిక్స్‌కు తీసుకురావడం మాకు ఆనందంగా ఉంది. ప్ర‌తిభావంతులైన ద‌ర్శ‌కుల‌తో క‌లిసి ప‌నిచేయడానికి ఇదొక అద్భుతమైన అవకాశం. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా సభ్యుల కోసం ఈ చిత్రాన్ని అందుబాటులోకి తెస్తున్నాం“ అన్నారు. పిట్ట‌క‌థ‌లు 19 ఫిబ్ర‌వ‌రి 2021 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉండ‌నుంది.

- Advertisement -