- Advertisement -
ఇండియన్ నేషనల్ ఆర్మీ వ్యవస్థాపకుడు, స్వాతంత్ర్య సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని స్థానిక కిసాన్ గల్లీలో నేతాజీ యువజన సంఘం ఆధ్యర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముథోల్ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నేటి యువత నేతాజీని స్పూర్తిగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. స్వాతంత్ర్య సంగ్రామంలో సుభాష్ చంద్రబోస్ చేసిన త్యాగాలు, సేవలు మరువలేనివని కొనియాడారు. యువత సుభాష్ చంద్ర బోస్ ను ఆదర్శంగా తీసుకొని సమాజ సేవలో ముందుండాలని పేర్కొన్నారు.
- Advertisement -