ఈ లక్షణాలుంటే..నరాల బలహీనతే!

47
- Advertisement -

నేటి రోజుల్లో చాలమందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్య నరాల బలహీనత. దీని కారణంగా ఇతరత్రా రోగాలు కూడా చుట్టుముడుతుంటాయి. ఈ వ్యాధి లక్షణాలను సరిగా గుర్తించకపోవడం వల్ల తీవ్రత పెరిగి అన్నో అనార్థాలకు దారితీస్తుంది. మన శరీరంలో నరాలు చాలా ముఖ్యమైనవి. రక్తాన్ని అవయవాలన్నిటికి చేరవేయడంలో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయి. వీటి పనితీరు మందగించినప్పుడు నరాల బలహీనత ఏర్పడుతుంది. శరీరంలో ఏవైనా ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియా ప్రవేశించిన నరాలపైనే ప్రభావం పడుతుంది. ఇంకా కొంతమంది దీర్ఘ కాలిక వ్యాధులతో సతమతమయ్యే వారిలో ఈ నరాల బలహీనత సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మన శరీరంలో నరాలు దెబ్బ తిన్నాయని గుర్తించడానికి కొన్ని లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి. మోకాళ్ళ నొప్పులు, కాళ్లు చేతుల్లో తిమ్మిర్లు వంటివి నరాల బలహీనతకు సంకేతాలే. .

ఇంకా తరచూ కళ్లు తిరిగినట్లు అనిపించడం, నీరసంగా ఉండటం, ఆహారం తినే ఆసక్తి లేకపోవడం, వంటివి కూడా నరాల బలహీనత లక్షణాలే. ఈ సమస్య ఉన్నవారిలో రక్త ప్రసరణ మందగిస్తుంది. జ్ఞాపక శక్తి లోపిస్తుంది, నిద్రలేమి, మలబద్దకం, ఎసిడిటీ వంటి లక్షణాలు కూడా నరాల బలహీనత ఉన్న వారిలో కనిపిస్తాయి. ఏ పని చేయలేక పోవడం, చిరాకుగా ఉండడం, మాట తడబడుతుండడం, వణుకు వంటి సమస్యలు కూడా నరాల బలహీనతలో కనిపించే ప్రధాన లక్షణాలు. కాబట్టి ఈ స్సమస్యను తేలికగా తీసుకోరాదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. నరాల బలహీనతను అదిగమించడానికి సరైన వైద్యంతో పాటు ప్రతిరోజూ పౌష్టికాహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. అంతే కాకుండా ప్రతి రోజూ వ్యాయామం చేయడం కూడా ముఖ్యమే. ఎందుకంటే వ్యాయామం వల్ల నరాలలో ఉత్తేజం పెరుగుతుంది. తద్వారా రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. తద్వారా నరాల బలహీనతను అధిగమించవచ్చు.

Also Read:Pawan:పవన్ ‘ వీరమల్లు ‘ సంగతేంటి?

- Advertisement -