సైగలతోనే దోచేశాడు లోకల్ నాని…

219
Nenu Local Teaser
Nenu Local Teaser
- Advertisement -

నేను శైలజ సినిమా హీరోయిన్ కీర్తి సురేష్‌-న్యాచురల్ స్టార్‌ నాని జంటగా రానున్న చిత్రం ‘నేను లోకల్‌’. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు శిరీష్‌ నిర్మాత. దిల్‌ రాజు సమర్పిస్తున్నారు. శుక్రవారం సింగిల్‌ షాట్‌ టీజర్‌ని విడుదల చేశారు. 28 సెకన్ల పాటు కేవలం సైగలతోనే సాగే ఆ టీజర్‌లో నాని, కీర్తి జంట ఆకట్టుకుంది. నాని ఈ చిత్రంలో బాబు అనే యువకుడిగా కనిపిస్తాడు. అమ్మాయి తన అందంతో అందరి హృదయాల్నీ దోచేసింది. ఓ అల్లరి అబ్బాయి ఆమె మనసుని కనుసైగలతోనే దోచేశాడు.

ఎలాంటి డైలాగులు లేకుండా వున్న టీజర్‌ సినీ లవర్స్‌ని ఆకట్టుకుంటోంది. ఇంకేముంది.. ముద్దు తప్పించి అక్కడ కొత్తగా క్రియేట్ చేసింది ఏమీలేదంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పడిపోతున్నాయి. ఆ కథేమిటో తెలియాలంటే ‘నేను లోకల్‌’ చూడాల్సిందే. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ చివర్లో నిర్మాత భావిస్తున్నారు.

- Advertisement -