- Advertisement -
నెల్లూరు సిటీ కి చెందిన రంజీ క్రికెట్ ప్లేయర్ అశ్విన్ హెబ్బార్ ను ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ ప్లేయర్స్ కొనుగోలులో ఢిల్లీ టీమ్ కొనుగోలు చేసింది.. 1995 లో జన్మించిన అశ్విన్ నెల్లూరు నుండి పలు క్రికెట్ టోర్నమెంట్ లలో ఆడుతూ రంజి మ్యాచ్ లకు ఎన్నిక కాబడి అండర్ 16 ఆంధ్ర ప్రదేశ్ టీం లీడర్ గా కూడా వ్యవహరించిన అనుభవం తో పాటు రంజీ క్రికెట్ మ్యాచ్ లలో ఉత్తమ ప్రతిభ కనబర్చి ఉండడంతో ఐపీఎల్ ల్ క్రికెట్ క్రీడాకారులు అమ్మకంలో మొట్ట మొదటి సారి.
తన పేరును నమోదు చేసుకున్న వెంటనే ఢిల్లీ టీం అశ్విన్ హెబ్బార్ ను 20 లక్షలకు కొనుగోలు చేయడం విశేషం.. రంజీ ప్లేయర్ గా అవకాశమే గొప్పగా భావిస్తున్నా ఈ తరుణంలో మన నెల్లూరు కుర్రోడు అశ్విన్ హెబ్బార్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఐపీఎల్ క్రికెట్ కు ఎన్నికవడం జిల్లాకే గర్వకారణం.
- Advertisement -