కంటిమందుపై ఆనందయ్య కీలక వ్యాఖ్యలు..

165
anandiah
- Advertisement -

తాను పంపిణీ చేసే కంటిమందు పంపిణీతో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఆనందయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. కంటిమందులో విషం లేదని..తాను మందు వేసిన వారందరిని ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు. కోర్టు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదని.. అనుమతి ఇవ్వకపోతే ప్రజలే ఇబ్బంది పడతారని వెల్లడించారు.

పదహారు సంవత్సరాలుగా కంటి ముందు వేస్తున్నాను ఎవరికీ ఇబ్బంది కలగలేదని.. ఎవరికి ఇంతవరకు కంటి చూపు దెబ్బ తినలేదని.. ఎవరికైనా ఇబ్బంది కలిగిందని చెప్తే నేను మందు ఇవ్వడం ఆపేస్తానని పేర్కొన్నారు.

పాజిటివ్ వచ్చిన ప్రతి ఒక్కరికి నా దగ్గరకు వస్తే ఉచితంగా ఇస్తున్నానని.. ప్రతి జిల్లాలో ఉచితంగా ఇస్తున్నామన్నారు. నా పేరు చెప్పుకోనీ ఎవరైనా అమ్ముకుంటున్నారేమో తెలియదు కానీ వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -