స్పైడర్‌ విలన్‌…. ఇకపై చేయడంట..!

234
Negative Role Only For Mahesh...!
- Advertisement -

తమిళంలో హీరోగా భరత్ పలు వైవిధ్యభరితమైన సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగు ప్రేక్షకులకు రిమేక్ సినిమాల ద్వారా దగ్గరైన భరత్‌…  చాలా కాలం తర్వాత ‘స్పైడర్’తో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. ఈ మూవీలో మెయిన్ విలన్ గా ఎస్.జె. సూర్య చేయగా .. మరో విలన్ గా భరత్ కనిపించనున్నాడు. ఈ సందర్భంగా ‘స్పైడర్’ గురించి ఒక ఇంటర్వ్యూలో భరత్ ఆసక్తికర విశేషాలు చెప్పాడు.

మురుగదాస్ అడగడమే ఆలస్యం, మరో ఆలోచన లేకుండా తాను ఈ సినిమా చేశానని భరత్ అన్నాడు. మహేశ్ కాంబినేషన్లో నేరుగా తెలుగు సినిమా చేసినందుకు తనకి చాలా హ్యాపీగా ఉందని చెప్పాడు. మహేష్ బాబు నుంచి చాలా నేర్చుకున్నాను. అంత స్టార్ హీరో అయి ఉండి కూడా ఆయన ఎదుటి వారికిచ్చే గౌరవం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయనకు సహనం చాలా ఎక్కువ. ‘స్పైడర్’ సినిమాను రెండు భాషల్లో చిత్రీకరించారు. ప్రతి సన్నివేశం రెండుసార్లు చేయాలి. కొన్నిసార్లు రీటేక్స్ ఉంటాయి. అయినా చాలా కూల్‌గా ఉండేవాడు.

మహేష్ తమిళం స్పష్టంగా మాట్లాడతాడు. నాకు తెలుగు సరిగా రాదు. నేను కొన్ని డైలాగుల విషయంలో చాలా ఇబ్బంది పడి ఎక్కువ టేక్స్ తీసుకునేవాడిని. అయినా మహేష్ ఓపిక పట్టేవాడు. నాకు.. మహేష్‌కు మధ్య వచ్చే సన్నివేశాల్ని 25 రోజుల్లో చిత్రీకరించారు. మురుగదాస్ స్క్రీన్ ప్లే విషయంలో మాస్టర్. ఇండియన్ క్రైమ్ థ్రిల్లర్ల చరిత్రలో ‘స్పైడర్’ బెస్ట్ మూవీ అవుతుంది.

మహేష్‌ మూవీ కాబట్టి విలన్ పాత్ర చేశానని  ఈ సినిమా తరువాత మళ్లీ విలన్ వేషాల జోలికి వెళ్లనని తేల్చి చెప్పాడు. ఈ సినిమాలో విలన్ గా ఆయన ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూడాలి మరి.

- Advertisement -