నెలకు రూ. 25 లక్షలు ఇస్తానన్నాడు!

27
neethu chandra
- Advertisement -

విష్ణు, గోదావరి, సత్యమేవ జయతే లాంటి సినిమాలతో మెప్పించిన నటి నీతూ చంద్ర. ఆ తర్వాత తెలుగులో కనుమరుగైనా తమిళ్, హిందీలలో సినిమాలు చేయగా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ షాకింగ్ న్యూస్ తెలిపింది.

ఎన్నో సక్సెస్ సినిమాల్లో నటించాను. నాది సక్సెస్ ఫుల్ యాక్టర్ ఫెయిల్యూర్ స్టోరీ. ఎంతో మంది జాతీయ అవార్డు అందుకున్న వాళ్ళతో నటించాను. పెద్ద సినిమాల్లో నటించాను. కానీ ఇటీవల నాకు వర్క్ లేని సమయంలో నాకు డబ్బు అవసరం వచ్చిందని తెలిపింది.

ఇది అదనుగా చూసుకొని ఒక పెద్ద వ్యాపారవేత్త అతని భార్యగా ఉండమని అడిగాడు. అతని భార్యగా ఉన్నందుకు నెలకి 25 లక్షలు ఇస్తానని, నెల నెలా జీతం తీసుకుని భార్యగా ఉండాలని అడిగాడని చెబుతూ ఎమోషన్ అయింది.

- Advertisement -