నీట్‌ యూజీ 2025.. ఫలితాలు విడుదల

9
- Advertisement -

విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న నీట్‌ (యూజీ) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది మే 4న జరిగిన పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీ ఇటీవలే విడుదల చేసిన ఎన్‌టీఏ, విద్యార్థుల అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం తుది ఫలితాలను విడుదల చేసింది.

అభ్యర్థులు తమ ఫలితాలను తెలుసుకోవాలంటే తమ రిజిస్టర్డ్‌ ఈమెయిల్‌ ఐడీలను పరిశీలించాల్సిందిగా ఎన్‌టీఏ సూచించింది.లేదా వారి వ్యక్తిగత లాగిన్‌ వివరాల్లోకి వెళ్లి అప్లికేషన్‌ నంబర్‌ ద్వారా స్కోర్‌కార్డ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని పేర్కొంది.

ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తాచాటారు. తెలంగాణకు చెందిన కాకర్ల జీవన్‌ సాయికుమార్‌ జాతీయ స్థాయిలో 18వ ర్యాంక్‌ను సాధించగా, షణ్ముఖ నిషాంత్‌ 37వ ర్యాంక్‌,మంగరి వరుణ్‌ 46వ ర్యాంక్‌,యండ్రపాటి షణ్ముఖ్‌ 48వ ర్యాంక్‌ను సాధించగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన దర్బా కార్తీక్‌రామ్‌ 19వ ర్యాంక్‌, కొడవటి మోహిత్‌ శ్రీరామ్‌ 56వ ర్యాంక్‌ను పొందారు.

నీట్‌ స్కోర్‌ కార్డు కోసం క్లిక్‌ చేయండి… https://examinationservices.nic.in/resultservices/Neet2025/Login వెబ్ సైట్‌ను సందర్శించండి.

Also Read:రాజాసాబ్..టీజర్ లీక్!

- Advertisement -