నీట్ యూజీ రీటెస్ట్ ఫలితాలు విడుదలయ్యాయి. గ్రేస్ మార్కులు, పేపర్ లీక్ సమస్య వల్ల 1563 మంది అభ్యర్థులకు మరోసారి పరీక్ష నిర్వహించారు. రీటెస్ట్‌కు హాజరైన విద్యార్థులు ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్ exams.nta.ac.in/NEET/ లో చూసుకోవచ్చు.
నీట్ యూజీ పరీక్షలో సమయం వృథా కారణంగా 1,563 మంది అభ్యర్థులకు గ్రేస్ మార్కులు కలిపారు. దానిని రద్దుచేసిన సుప్రీంకోర్టు గ్రేస్‌మార్కులను మినహాయించి తిరిగి పరీక్షను ఎంచుకునే అవకాశాన్ని కల్పించింది.
నీట్ యూజీ పరీక్ష దేశవ్యాప్తంగా మే 5న నిర్వహించారు. దీనికి 24 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. జూన్ 4న పరీక్ష ఫలితాలను ఎన్టీఏ ప్రకటించింది. అందులో 67 మంది విద్యార్థులు 720 మార్కులు సాధించారు. వారిలో ఆరుగురు హర్యానాలోని ఝజ్జర్ కేంద్రానికి చెందినవారే కావడం అనుమానాలకు తావివ్వగా నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై దర్యాప్తు కొనసాగుతోంది.
Also Read:పరదాలు కడితే…సస్పెండే!