నీలిమ ప్రొడక్షన్ పతాకంపై ఆనంద్ కృష్ణ,స్వరూప హీరో హీరోయిన్లు గా బేబీ హర్షిత ప్రధాన పాత్రలో ఆనంద్ కృష్ణ నిర్మాతగా సూర్యకిరణ్ ఇలాది దర్శకత్వంలో భక్తి రస చిత్రం “నీలిమలై ” వనపర్తి పరిసర ప్రాంతాలలో శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది. ఈ సందర్భంగా నిర్మాత మరియు హీరో ఆనంద్ కృష్ణ మాట్లాడుతూ…. కేరళ లో వివిధ లొకేషన్స్ లో 70 శాతం షూటింగ్ పూర్తిచేసుకొని మిగిలిన 30 శాతం షూటింగ్ ప్రస్తుతం వనపర్తి పరిసర ప్రాంతాలలో శరవేగంగా షూటింగ్ జరుపుతున్నామని ఈ నెల 24 తో షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ ఈ చివరి వారం లోపే పూర్తిచేసి ఇదే నెల ఆడియో ని డిసెంబర్ మొదటి వారం లో సినిమా ను విడుదల చేయనున్నామన్నారు.
దర్శకుడు సూర్య కిరణ్ ఇలాది మాట్లాడుతూ….ఈ చిత్రం లో ఆరు పాటలకు సదివె దేవేంద్ర మంచి మ్యూజిక్ ఇచ్చారన్నారు.అయ్యప్ప భక్తులకు నచ్చేవిధంగా తీర్చిదిద్దమన్నారు.ఇంకా ఈ చిత్రం లో సాయికిరణ్,అలీ ,భానుచందర్,సత్యప్రకాష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ ఆనందకృష్ణ ,మాటలు:రామచంద్రారెడ్డి,కెమెరా:కిరణ్ కుమార్ కొండా,సంగీతం:సదివె దేవేంద్ర,నిర్మాత:ఆనంద్ కృష్ణ, కథ-స్క్రిన్ ప్లై -దర్శకత్వం: సూర్య కిరణ్ ఇలాది