నీదీ నాదీ ఒకే కథ…వసూళ్లు అదుర్స్

252
- Advertisement -

విభిన్న కథలతో వరుస విజయాలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో శ్రీవిష్ణు. తాజాగా వేణు ఉడుగుల దర్శకత్వంలో నీదీ నాదీ ఒకే కథ అంటూ ప్రేక్షకుల ముందుకువచ్చాడు. శ్రీ విష్ణు సరసన బిచ్చగాడు ఫేం సట్నా టైటస్ నటించగా సినిమా పాజిటివ్ టాక్‌తో వసూళ్ల పంటపండిస్తోంది.

విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ అయిన ఈ చిత్రం రివ్యూలు సైతం పాజిటివ్‌గా రావడంతో ప్రేక్షకులు బ్రహ్మారథం పడుతున్నారు . విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న ఈ చిత్రం హౌస్ ఫుల్ కలెక్షన్లతో బాక్సాఫీసు వద్ద అదరగొడుతోంది.

ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ వీకెండ్ రూ. 1.90 కోట్ల షేర్ సాధించింది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.60 కోట్ల షేర్ కలెక్ట్ అవ్వగా… ఓవర్సీస్‌లో రూ. 30 లక్షలు వసూలు చేసింది.

ప్రస్తుతం బాక్సాఫీసు రేసులో ఉన్న సినిమాల్లో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి డిమాండ్ ఏర్పడటంతో 3వ రోజు నుండి మరో 70 థియేటర్లు అదనంగా యాడ్ చేశారు. చిన్న బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లతోనే లాభాల్లోకి వెళ్లి ప్రేక్షకులను థియేటర్ల వైపుకు క్యూకట్టిస్తోంది.

needi nadi oke katha

- Advertisement -