ఎన్టీఆర్‌తో హాలీవుడ్ భామ..ఇంతకు ఎవరీ ఎడ్గార్ జోన్స్..!

318
ntr edgar jones
- Advertisement -

బాహుబలి తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్‌ఆర్ఆర్(వర్కింగ్ టైటిల్‌). సినిమా కథకు సంబంధించి వివరాలతో పాటు రిలీజ్ డేట్‌ను రివీల్ చేశారు జక్కన్న. అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురంభీంగా ఎన్టీఆర్‌ నటిస్తుండగా జూలై 30,2020న ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

ఇక ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ఎడ్గార్ జోన్స్‌ నటించనుండగా గుగూల్‌లో ఈ హీరోయిన్‌ గురించి వెతికే వారి సంఖ్య అంతకుఅంత పెరిగిపోతోంది. బ్రిటన్‌లోని మస్వెల్ హిల్స్ ప్రాంతానికి చెందిన డ్రామా ఆర్టిస్ట్ డైసీ ఎడ్గార్ జోన్స్.. ప్రతిష్టాత్మక నేషనల్ యూత్ థియేటర్ నుంచి ఎడ్గర్ సంబంధించిన కోర్సులు చేసిన ఎడ్గర్ తర్వాత కొన్ని టెలివిజన్‌ సీరియల్స్‌లో నటించింది. సైలెంట్ విట్నెస్, కోల్డ్ ఫీట్ వంటి టీవీ సిరీస్‌లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

1997లో మోస్ట్ పాపులర్ అయిన కోల్డ్ ఫీట్ టీవీ షోకు ఎడ్గర్ అదనపు ఆకర్షణగా నిలిచింది. ఈ షోలో ఒలివియా అనే సాధారణ యువతి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. అందంతో పాటు అద్భుత నటను ప్రదర్శించిన ఈ టీవీ షో ఎడ్గర్‌కు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. పాండ్‌లైఫ్ అనే సినిమాలో నటించి మెప్పించింది. ఈ నేపథ్యంలో తారక్‌ సరసన ఎడ్గార్ జోన్స్‌ని ఎంపికచేశారు జక్కన్న. తెలుగు తెరకి పరిచయం కాబోతున్న ఈ హాలీవుడ్‌ భామను ప్రేక్షకులు ఎలా రీసివ్ చేసుకుంటారో వేచిచూడాలి.

- Advertisement -