“నీ ప్రేమ కోసం” ప్రేమకే ఛాలెంజ్‌..

246
- Advertisement -

రెండక్షరాల ప్రేమ రెండు మనసులు కలుపుతుంది. రెండు జీవితాలను నిండు నూరేళ్లు ఆనందమయం చేస్తుంది. అలాంటిది ప్రేమ కోసం లైలా-మజ్ను, పార్వతి-దేవదాసు, అక్బర్‌ సలీం-అనార్కలీ వంటి..ఎందరో ప్రేమికులు తమ జీవితాలను అర్పించారు. ఆ కోవకు చెందిన ఒక ప్రేమికుడి కథే ‘నీ ప్రేమ కోసం’ చిత్రం. మాస్టర్‌ గోవింద్‌ బోగోజు సమర్పణలో సరోవర్‌ ఫిలిమ్స్‌ పతాకంపై ప్రముఖ కవి, కార్టూనీస్ట్‌, రంగస్థల నటుడు, కథా రచయితైన ‘ఉలి’ దర్శకత్వంలో అన్ని కమర్షియల్‌ హంగులతో రూపొందుతున్నట్టు చిత్ర నిర్మాత ఉప్ఫల గంగాధర్‌ తెలిపారు.

Nee Prema Kosam Movie Details

క్రైమ్‌ బేస్డ్‌ లవ్‌స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రేమ, కుటుంబ, కుల, మత, ఉగ్రవాదం,మావోయిజం వంటి పలు సమస్యలను సృశిస్తూ, ప్రేమకే ఒక ఛాలెంజ్‌గా నిలుస్తుంది ఆయన పేర్కొన్నారు. నిర్మాణాంతర పనుల పూర్తి చేసుకొని, త్వరలో విడుదలకు సిద్దమైతున్న ఈ చిత్రానికి తారాగణం: జొన్న పరమేశ్‌,రాధ బంగారు, మచ్చ రవిందర్‌, జ్యోతిష్య పండితులు, నంబి వేణుగోపాలాచార్య కౌశిక, వాసుదేవ్‌ నంబి, విజయ్‌ బాబా, కల్యాణ్‌ చక్రవర్తి, కంప్యూటర్‌ ప్రభాకర్‌, సింహరాజు కోదండ రాములు, మాస్టర్‌ బోగోజు గోవింద్‌, యెన్నమనేని శ్రీనివాస్‌రావు, కె.ఆర్‌.కృష్ణ, బొగె అశోక్‌, కాసాల శ్రీనివాస్‌, రమ్యశ్రీ, సుజాత, తదితరులు.

సాంకేతిక వర్గం: సినిమాటోగ్రఫీ-వేమూరి చంద్రశేఖర్‌, ఎడిటర్‌-సంపత్‌రాజ్‌, సత్రాజ్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌-పాకాల దేవేందర్‌ రెడ్డి, సంగీతం-కె.లక్ష్మణ్‌సాయి, సహ నిర్మాతలు-గోలి వెంకట రమణ, శైలజమూర్తి, నిర్మాత- ఉప్పల గంగాధర్‌, కథ, మాటలు, పాట, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం- ఉలి.

- Advertisement -