సర్కారు నౌకరి..లిరికల్ సాంగ్

47
- Advertisement -

ప్రముఖ సింగర్ సునీత కుమారుడు ఆకాష్ హీరోగా పరిచయవుతున్న సినిమా “సర్కారు నౌకరి”. ఈ చిత్రంలో భావన హీరోయిన్ గా నటిస్తోంది. సర్కారు నౌకరి చిత్రాన్ని ఆర్కే టెలీ షో బ్యానర్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మిస్తున్నారు. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. “సర్కారు నౌకరి” సినిమా న్యూఇయర్ సందర్భంగా వచ్చే జనవరి 1న థియేటర్స్ లో ఘనంగా విడుదలవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘నీ పసుపు పాదాలే..’ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.

‘నీ పసుపు పాదాలే..’ పాటకు శాండిల్య పీసపాటి బ్యూటిఫుల్ ట్యూన్ కంపోజ్ చేసి కీర్తనతో కలిసి పాడారు. కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించారు. ‘నీ పసుపు పాదాలే తగిలి గడప పూసెనా…నీ ఎరుపు సిగ్గుల్లో ఎలిగి మెరిసెనా..కంచు మట్టె సప్పుల్లో ఇళ్లే కళ్లు తెరిసి సూసెనా…’అంటూ నవ వధువు అత్తింట్లో అడుగుపెట్టిన సంతోషకరమైన సందర్భంలో సాగుతుందీ పాట. కథలో భాగంగా ఈ పాటను పిక్చరైజ్ చేసినట్లు తెలుస్తోంది.

Also Read:రికార్డుల మోత..సౌతాఫ్రికా చిత్తు!

- Advertisement -